Movies

అల్లు అరవింద్ కోడళ్ల గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. కొడుకు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. మరో కుమారుడు శిరీష్ కూడా హీరోగా ఉన్నాడు. ఇక పెద్ద కొడుకు అల్లు బాబీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంటారు. ఇద్దరు కొడుకులకు పెళ్ళికాగా,శిరీష్ కి ఇంకా అవ్వాల్సి ఉంది. కోడళ్ళు ఉన్నత విద్యావంతులే కాకుండా వ్యాపార వేత్తలు కూడా. వ్యాపార నిర్వహణలో కూడా ఆరితేరిన వారే అని చెప్పాలి. ఇలా విద్యావంతులు ,వ్యాపార వేత్తలను అరవింద్ కోడళ్ళుగా తెచ్చుకున్నాడు. పెద్ద కొడుకు బాబీ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట్లో పెళ్లాడిన నీలిమకు విడాకులిచ్చి,నీలూష అనే యోగ ట్రైనర్ ని తాజాగా పెళ్లిచేసుకున్నాడు. నీలిమ ,నీలు ఇద్దరూ బాగా చదువుకున్నవారు. 

పిజి వరకూ చదివిన నీలిమ విజయవాడకు చెందిన మహిళ. 2007ఆగస్టులో ఆమెను బాబీ పెళ్లి చేసుకున్నాడు. పెద్దకోడలిగా బాధ్యతలు చేస్తూనే వీడియో గేమ్ రంగంలో వ్యాపారం చేసింది. 2009లో బాబీ,నీలిమలకు అన్విత అనే పాప పుట్టింది. 2016లో మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. జూన్ 21న నీలుషా అనే ముంబయి ముద్దగుమ్మను పెళ్లాడాడు. పూణే ఇనిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఈమె యోగ డిస్ట్రనేషన్ అనే కేంద్రాన్ని సిస్టర్ తో కలిపి నడుపుతోంది. అష్టాంగ యోగాలో శిక్షణ ఇవ్వడంలో నిష్ణాతురాలు. ముంబయిలో పుట్టినప్పటికీ హైదారాబాద్ లో సెటిల్ అయింది. వయస్సులో తనకంటే పెద్దవాడైన బాబీని పెళ్లి చేసుకుంది. 

అరవింద్ రెండో కుమారుడు అర్జున్ టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఒకడిగా రాణిస్తున్నాడు. ఇతడి భార్య స్నేహ రెడ్డి హైదరాబద్ లో పుట్టి పెరిగింది. 2011లో వీరి పెళ్లి జరిగింది. ప్రేమించి కాకుండా పరస్పర అంగీకారంతోనే తమ పెళ్లి జరిగిందని బన్నీ గతంలోనే చెప్పుకొచ్చాడు. జిమ్నా స్టిక్స్ ,డాన్స్ అంటూ తిరిగిన బన్నీ పెద్దగా చదువుకోలేదు. స్నేహ రెడ్డి అమెరికాలో కంప్యూటర్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసారు. 
ఇండియా వచ్చాక ఆమె ఫ్యామిలీ నిర్వహించే సెయింట్ కాలేజీపై దృష్టి పెట్టి,కాలేజీ అభివృద్ధికి కృషి చేసింది. సెయింట్ కాలేజీ రిక్రూట్ మెంట్ విభాగం డైరెక్టర్ గా ఇప్పటికీ తన పాత్ర పోషిస్తోంది. ఈమె కోరిక మేరకు బన్నీ సదరు కాలేజీ వార్షికోత్సవానికి వెళ్లి స్టూడెంట్స్ ని ఉత్సాహ పరిచాడట. ఇద్దరు పిల్లల పెంపకంతో బిజీగా ఉంటున్న స్నేహా రెడ్డి స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆన్ లైన్ ఫొటోగ్రఫీ స్టూడియో కూడా రన్ చేస్తున్నారు.