Movies

డైరెక్టర్‌ శంకర్‌ కండీషన్‌ ఏంటీ?

ఇండియన్‌ 2 చిత్రం షూటింగ్‌లో గాయపడ్డ శంకర్‌ పరిస్థితి ఏంటి అంటూ నిన్నటి నుండి అభిమానులు మరియు మీడియా వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని క్లారిటీ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున శంకర్‌ ఆరోగ్య పరిస్థితి తొసుకునేందుకు ఆయన ఇంటి వద్దకు చేరుకోవడం, లైకా ప్రొడక్షన్‌ ఆఫీస్‌ వద్దకు చేరుకోవడం చేశారు.

ఎట్టకేలకు శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వచ్చింది.శంకర్‌ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని, కాలుకు పాశ్చర్‌ అన్నారు.అది కూడా ఏం లేదని ఈ సందర్బంగా తేలిపోయింది.హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అయిన శంకర్‌ ఇంటికి చేరుకున్నారు.ఆయనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.దాంతో శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని గంటలుగా వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది.

శంకర్‌ ఒక కాలు తీసేయాల్సి వచ్చిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అంటూ ఎవరికి తోచిన విధంగా వారు పుకార్లు పుట్టించే ప్రయత్నం చేశారు.దాంతో తాజాగా తమిళ మీడియా వారికి శంకర్‌ ప్రస్తుతం పరిస్థితి ఫొటోను పంపించడం జరిగింది.

ఆ ఫొటోలో శంకర్‌ ఆరోగ్యంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు.ఆయనకు ఎలాంటి ప్రమాదం అయితే కాలేదు కాని తన వారిని కోల్పోయాను అనే బాధ మాత్రం ఆయనలో కనిపిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."