Movies

చిన్న నిర్మాతల పాలిట వరంగా మారిన ఓటీట…నిర్మాతలు రోజుకి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో థియేటర్లు బంద్‌ ఉన్నాయి.ఆ థియేటర్లు ఎప్పుడు ఓపెన్‌ అయ్యేను, ఎప్పుడు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేను.ఇలాంటి పరిస్థితుల్లో విడుదలకు సిద్దం అయిన చిన్న సినిమాలకు ఓటీటీ ఒక మంచి అవకాశం కలిగిస్తుంది.ప్రేక్షకులను ఆకర్షించే సినిమాలకు నిర్మాతలు కాసులు పండిస్తున్నారు.అమెజాన్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమ్‌ చేసుకోవడంతో నిర్మాతలకు అంతో ఇంతో డబ్బులు వస్తున్నాయి.

ఇటీవల విడుదలైన కొత్త సినిమాలను కూడా ఇక్కడ స్ట్రీమింగ్‌కు ఉంచారు.ప్రస్తుతం జనాలు అంతా కూడా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు.ఆ కారణంగా సినిమాలను ఓటీటీ ద్వారా శాటిలైట్‌ ద్వారా ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పుడు ఓటీటీలో ప్రసారం అయ్యి ఎంత మంది ఎక్కువగా చూస్తే అంతగా నిర్మాతలకు డబ్బులు వస్తాయి.

చిన్న సినిమాల నిర్మాతలు రోజుకు లక్ష నుండి రెండు లక్షల వరకు కూడా సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.సినిమాలకు నిర్మాతలు పబ్లిసిటీ చేసుకుంటూ ప్రస్తుతం హంగామా సృష్టిస్తున్నారు.ఈమద్య కాలంలో అమెజాన్‌ కూడా టీవీల్లో భారీగా యాడ్స్‌ ఇస్తుంది.అందువల్ల మంచి వ్యూవర్స్‌ను చిత్ర చిత్రాలు దక్కించుకుంటున్నాయి.దాంతో నిర్మాతలకు కలిసి వస్తున్నది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."