Movies

తారక్ లాక్ డౌన్ లో ఏంచేస్తున్నాడో తెలిస్తే వావ్ అంటారు

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం నడుస్తున్న లాక్‌డౌన్ పీరియడ్ లో అందరు హీరోలు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా ఒక్కోహీరో తన కుటుంబ సభ్యులతో గడపడంతో పాటు వాళ్లు ఇన్నాళ్లు చూడని సినిమాలను చూస్తున్నారు. ఇంకొందరు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రజలకు మెసేజ్ లు ఇస్తున్నారు. ఇంటిపనుల్లో పాలుపంచుకుంటున్నారు. మరికొందరు హీరోలు వేరే భాషలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ తో ఉన్నారు. అవును ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పనిచేస్తున్నాడు.

మలయాళ భాషపై తారక్ పట్టుపెంచుకుంటున్నారు. దీని కోసం మోహన్ లాల్ కూడా సహాయం కూడా తీసుకుంటున్నాడు. త్వరలో మలయాళంలో కూడా ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రస్తుతం ఇంట్లో మలయాళ భాషపై పట్టుపెంచుకుంటున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉండకుండా మలయాళ భాషను నేర్చుకోవ డానికి కారణం ఏమిటంటే, రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌తో పాటు ఈ సినిమా టైటిల్‌ ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు.

మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత మరో విజువల్ ట్రీట్‌లా కనిపిస్తోంది. ఈ టీజర్‌కు ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ ఓ రేంజ్‌లో ఉంది. ఒక్క తెలుగులోనే కాదు. హిందీలో తమిళంలో,కన్నడలో ఎన్టీఆరే తన వాయిస్ అందించాడు. మలయాళంలో మాత్రం వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు. ఒక ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కబోతున్న ఓ సినిమాకు ఓ హీరో ఇన్ని భాషల్లో ఓన్ డబ్బింగ్ చెప్పడం ఈ జనరేషన్‌లో ఇదే ప్రథమం అనే చెప్పాలి. అంతేకాదు ఆయా భాషల్లో ఎన్టీఆర్ వాచకం ఎక్కడా తడబడలేదు. అందుకే ఇంకా భాషపై పట్టు పెంచుకుంటున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."