Movies

డిజిటల్ ప్లాట్ ఫాంలో రిలీజ్ కాబోతున్న మొదటి తెలుగు సినిమా

ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా గట్టి దెబ్బ పడింది. దీనితో అనేక సినిమాల విడుదల ఆగిపోయాయి. అంతే కాకుండా షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. షూటింగ్స్ అందాకా నిలిచిపోవడం వల్ల కొంత నష్టమే కానీ అప్పటికే షూటింగ్స్ పూర్తయ్యిపోయి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలే అందులోను చిన్న సినిమాలు అయితే మరీ ఇబ్బంది అని చెప్పాలి.

అలాంటి ఓ చిన్న సినిమాయే ఇప్పుడు విడుదల కాకముందే డిజిటల్ గా అందుబాటుకిలోకి రానున్నట్టు తెలుస్తుంది. అదే “అమృతారామమ్”. రామ్ మిట్టకంటి హీరోగా అమితా రంగనాథన్ హీరోయిన్ గా సురేందర్ కొంటెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కింది.

ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ గా రాబోతున్న మొట్ట మొదటి చిత్రం అది. అయితే ఈ సినిమా ఇప్పటికే రాజ్ తరుణ్ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా నటించిన “ఇద్దరి లోకం ఒకటేగా” ఎప్పుడో విడుదలై నిన్ననే టీవిలో కూడా వచ్చేసింది. 2011లో వచ్చిన టర్కిష్ భాషకు చెందిన సినిమాకు ప్రేరణగా ఈ చిత్రాలు తెరకెక్కాయి. ఈ చిత్రం ఈ ఏప్రిల్ 25 నుంచి జీ 5 స్ట్రీమింగ్ యాప్ లో అందుబాటులోకి రానుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."