Movies

నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా.. ఎవరిని ఉద్దేశించి…?

కొన్ని విషయాలపై మాట్లాడాలంటే హీరో హీరోయిన్స్ కి సమయస్ఫూర్తి కావాలి. ఎక్కడా బాలన్స్ తప్పకూడదు. ఇక సీరియస్ అంశాలు,సున్నితమైన అంశాల విషయంలో చూస్తే మరీ జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు అన్ని చోట్లా బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గురించి జోరుగానే చర్చ నడుస్తోంది. ఇక నెట్ లో అయితే నెటిజన్స్ రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు సైతం ట్విట్టర్ వేదికగా స్పందించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చ లో సినీ ప్రముఖులందరు బాలీవుడ్‌లోని బంధుప్రీతిపై వాళ్ళ యాంగిల్ లో మాట్లాడుతూ వచ్చారు.

అయితే తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్కి బ్యూటీ తమన్నా బాలీవుడ్‌తో పాటు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజంపై అదరగొట్టేలా వ్యాఖ్యానించింది. ‘మా ఫ్యామిలీలో అందరు డాక్టర్లే ఉన్నారు. ఒకవేళ నేను అదే వృత్తిలో కొనసాగితే.. నా ఇంట్లో వాళ్లు నన్ను గైడ్ చేసి ఉండేవారంటూ చెప్పుకొచ్చింది. ఫ్యూచర్‌లో నా పిల్లలు ఒకవేళ సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే వాళ్లను నేను గైడ్ చేస్తా. నేను సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చా. నా లాగే చాలా మంది కూడా సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇండస్ట్రీకి వచ్చినవాళ్లే’అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

నేను కెరీర్ ప్రారంభించినపుడు తెలుగు, తమిళ సినిమాలు చేయడం ప్రారంభించానని ఈ రెండు చోట్ల నాకు ఎక్కడా పరిచయాలు లేవని, అయినా నా ఛాన్సులు నాకు వచ్చాయ ని మిల్కి బ్యూటీ తమన్నా పేర్కొంది. నా కష్టాన్ని, ప్రతిభను చూసి నాకు అవకాశాలు తలుపు తట్టాయని, నా హిట్స్‌తో ఫ్లాప్స్‌కు కారణం నా కష్టమే కారణం అంటున్నారు. ఇక బంధు ప్రీతి, రాజకీయాలు అనేవి ప్రతి రంగంలో ఉన్నాయి. అవి ఒకరి విజయాలను పరాజయాలను నిర్ధేశించలేవంటూ వ్యాఖ్యానించింది ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దలుగా చలామణి అయినవారు.. ఒకప్పుడు ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా స్వయంకృషితో వచ్చినవాళ్లే నని తమన్నా చెప్పింది. అలా వచ్చిన వాళ్లు నిలదొక్కుకున్న తర్వాత వాళ్లకు సంబంధించిన వాళ్లను ప్రోత్సహించడం అన్ని రంగాల్లో మాదిరిగా సినిమా ఇండస్ట్రీ లో కూడా మామూలేనని తమన్నా క్లారిటీగా చెప్పింది.