Movies

సుధీర్ బాబుకి ‘V” సినిమా ప్లస్ అవుతుందా…మైనస్ అవుతుందా ?

“V” సినిమాలో నాని,సుధీర్ బాబు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా నానికి 25 వ సినిమా. నాని సినిమా అంటే డామినేషన్ చాలా ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ సారి ‘V” సినిమాలో సుధీర్ బాబుతో గట్టి పోటీ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో నాని సైకో గా నటిస్తే , సైకో ఆట‌లు క‌ట్టిప‌డేసే పోలీస్ అధికారిగా సుధీర్ బాబు క‌నిపించ‌నున్నాడు.

నాని న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న డైలాగ్ డెలివ‌రీతో, న‌ట‌న‌తో… మెస్మ‌రైజ్ చేస్తాడు. అయితే `వి`లో సుధీర్ బాబు పాత్ర కూడా అందుకు ధీటుగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ట్రైల‌ర్‌లో త‌న ఎయిట్ ప్యాక్ బాడీతో షాక్ ఇచ్చాడు సుధీర్ బాబు. త‌న‌పై తెర‌కెక్కించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు మాస్‌ని అల‌రిస్తాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. సుధీర్ బాబుకి ఈ సినిమా సరికొత్త ఇమేజ్ ని తీసుకొస్తుందని అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."