Movies

కరాటే కళ్యాణి జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే అవ్వాలసిందే

సినిమాల్లో నటిస్తూ తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న కరాటే కళ్యాణి బిగ్ బాస్ 4వ సీజన్ ప్రారంభం సందర్బంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ రియాల్టీ షోలో 16మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఒక్కొక్కరినీ నాగ్ పరిచయం చేస్తుంటే, 12వ కంటెస్టెంట్ గా కరాటే కళ్యాణి వచ్చింది. నిజానికి ఈమె హరికథల్లో ఆరితేరింది. అందుకే నాగ్ అడగ్గానే ఈ విషయం చెబుతూ, ఈ షోను హరికథ రూపంలో చెప్పింది. హరికథే తనకు అన్నం పెట్టిందని కళ్యాణి చెప్పింది. అంతేకాదు , తనకు పిల్లలు లేరని, ఓ బాబుని దత్తత తీసుకుని పెంచుకుంటున్నానని చెప్పడంతో నాగ్ ఫ్లాట్ అయిపోయి ఆమె ఔదార్యాన్ని మెచ్చేసుకున్నాడు.

పిల్లలు కనాలని ఉన్నా,తనకు ఆ యోగ్యత లేనందున ఎంతో పరితపించానని చెప్పింది. అయితే ఓరోజు ‘ఓ బాబును కోళ్ల గూడులో ప‌డేసారు, మీరు పెంచుకుంటారా?’ అని వ‌చ్చిన ఫోన్ కాల్ తో వెంట‌నే బాబును ద‌త్త‌త తీసుకుని అత‌డే స‌ర్వ‌స్వంగా ఆల‌నాపాల‌నా చూసుకుంటున్నట్లు చెప్పింది. బిగ్‌బాస్‌లో ఉంటే త‌న‌ను తాను అద్దంలో చూసుకోవ‌డ‌మేన‌ని నాగ్ అడిగిన ప్రశ్నకు కళ్యాణి తనదైన శైలిలో బదులిచ్చింది. మ‌రి అద్దంలో త‌న‌కు త‌నే కొత్త‌గా క‌నిపిస్తారా? అని ఆమె చెబుతూ ఎమోషన్ అయింది.

ఇక అంద‌రూ త‌న‌ను మోసం చేశారని చేదు సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేసుకుంది. అచ్చ మైన తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టుతో వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి లో పుట్టిన ఈమె చదువు,బాల్యం అంతా విజయనగరంలోని జరిగింది. హరికథల్లో రాణిస్తూ నాటక రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆతర్వాత వెండితెరపై మెరిసింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ , రవితేజ నటించిన కృష్ణ సినిమాలోని బా..బీ డైలాగ్ తో పాపులర్ అయింది. ఇక యూనియన్ వ్యవహారాల్లో కూడా చురుగ్గానే ఉంటుంది. తాను నాగ్ అంటే ఇష్టమని చెప్పడం కొసమెరుపు.