Lemon And Tea For Hair:షాంపూలో ఇది కలిపితే చాలు.. చుండ్రు లేకుండా జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Lemon and tea for hair: జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు చిట్లిపోవటం వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. ఆడవారి కాకుండా మగవారు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు.
పొడవైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. టీ డికాషన్ జుట్టు సమస్యల పరిష్కారానికి చాలా బాగా సహాయపడుతుంది.జుట్టు రాలే సమస్యను ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో టీ డికాషన్ చాలా బాగా సహాయపడుతుంది.
టీ ఒక అద్భుతమైన టోనర్ గా చెప్పవచ్చు.ఒక గిన్నెలో 2గ్లాసుల నీటిని పోసి స్పూన్ న్నర టీ పొడి వేసి బాగా మరిగించి ఆ నీళ్లు బాగా మరిగాక ఆ నీటిని వడగట్టి నిమ్మరసం ఒక స్పూన్ వెయ్యాలి.
దీనిలో మనం రెగ్యులర్ గా వాడే షాంపూనూ వేయాలి. ఈ మూడు పదార్థాలు బాగా కలిసేలా కలపాలి ఇందులో వాడిన నిమ్మరసం జుట్టులో ఉన్న జిడ్డును తొలగించడానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయటానికి సహాయపడి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.
ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంటయ్యాక సాధారణమైన నీటితో తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు రెండు నెలలపాటు చేస్తే జుట్టు దృఢంగా పెరగడమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


