Healthhealth tips in telugu

మెంతులు+జీలకర్ర కలిపి తీసుకుంటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Fenugreek and jeera water benefits in telugu : మెంతులు, జీలకర్ర రెండింటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వీటిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.ఒక గ్లాసు నీటిలో అర స్పూన్ జీలకర్ర,పావుస్పూన్ మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి.
fenugreek seeds Benefits in telugu
మరుసటి రోజు ఉదయం నానబెట్టిన జీలకర్ర,మెంతులు తింటూ ఆ నీటిని తాగేయాలి.అలా కాకుండా ఇలా కూడా తాగవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అర స్పూన్ జీలకర్ర పొడి,పావుస్పూన్ మెంతి పొడి వేసి బాగా మరిగించి, వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
jeelakarra Health Benefits in telugu
పై రెండు విధానాలలో ఏ విధంగా .తీసుకున్నా మంచి ప్రయోజనం కనపడుతుంది. ఈ నీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యతో బాధ పడేవారికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. .జీర్ణ సమస్యలు అన్ని తొలగిపోతాయి.
Diabetes diet in telugu
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు అన్ని బయటకు పోతాయి.. డయబెటిస్ ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగేలా చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రోగనిరోదక శక్తి బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.