Healthhealth tips in telugu

రక్తనాళాల్లో బ్లాకేజ్‌లు రాకుండా ఉండాలంటే.. రక్తాన్ని సహజంగా పలుచగా చేసే ఈ సూపర్ ఫుడ్స్ తినండి!

Blood Thinning Foods : రక్తనాళాల్లో రక్తం చిక్కబడి గడ్డకట్టడం (Blood Clotting) అనేది తీవ్రమైన గుండెజబ్బులు, పక్షవాతం (Stroke) మరియు హార్ట్ ఎటాక్‌కు దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి. శారీరక శ్రమ తగ్గడం, చెడు కొలెస్ట్రాల్ పెరగడం, హై బీపీ మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు రక్తప్రసరణను మందగింపజేసి రక్తం గడ్డకట్టే ముప్పును పెంచుతాయి.

దీని నివారణకు రసాయన బ్లడ్ థిన్నర్ మందులపై మాత్రమే ఆధారపడకుండా, ప్రకృతి సిద్ధంగా లభించే కొన్ని అద్భుతమైన ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవచ్చు. వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చినచెక్క వంటి వాటిలో సహజసిద్ధమైన సాలిసిలేట్స్ మరియు యాంటీ-థ్రాంబోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి రక్తాన్ని సహజంగా పలుచబరిచి, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి గుండెను పదిలంగా ఉంచుతాయి. ఈ పోస్ట్‌లో రక్తాన్ని పలుచగా ఉంచే ఉత్తమ సహజ ఆహారాలు మరియు వాటిని తీసుకునే సరైన పద్ధతులను వివరంగా తెలుసుకుందాం.

గుండె సమస్యలు లేకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్తం పల్చగా ఉండి రక్తం గడ్డకట్టకుండా ఉంటే సరిపోతుంది. రక్తం చిక్కగా ఉన్నప్పుడు ర‌క్తంలోని ప్లేట్‌లెట్స్‌, ఎర్ర ర‌క్త క‌ణాలు, తెల్ల ర‌క్త క‌ణాలు, ప్రోటీన్స్ క‌లిసి ర‌క్తం గ‌డ్డ క‌ట్టేలా చేస్తాయి.

దీంతో ర‌క్త నాళాల్లో రక్తం గ‌డ్డ క‌డుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ లు వ‌స్తాయి. అయితే ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా ప‌లుచ‌గా ఉండాలంటే కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే రక్తం గడ్డకట్టకుండా పలుచగా ఉంటుంది. కాస్త ఓపికగా ఈ ఆహారాలను తీసుకోవాలి.

బీట్ రూట్ జ్యూస్ తాగితే బీట్ రూట్ లో ఉండే నైట్రేట్స్ రక్తం గడ్డకట్టకుండా పల్చగా ఉండేలా చేయడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బీట్ రూట్ జ్యూస్ తగిన మూడు గంటల్లోనే నైట్రేట్స్ లెవల్స్ పెరుగుతాయి. అందువల్ల ప్రతి రోజు బీట్ రూట్ జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఉండదు.

టమోటా కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. టమోటాలో ఉండే క్లోరోజెనిక్‌, ఫెర్యులిక్ వంటి మూల‌కాలు ర‌క్తంలోని ప్లేట్‌లెట్స్ గ‌డ్డ క‌ట్ట‌కుండా నిరోధిస్తాయి. దాంతో రక్తం పలుచగా ఉంటుంది. రోజు ఒక టమోటాను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్ చేసుకొని తాగవచ్చు.

డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ రక్తం గడ్డకట్టకుండా పలుచగా ఉండేలా చేస్తాయి. అలాగే డార్క్ చాక్లెట్‌ల‌లో కోకోవా ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న రక్తం పలుచగా ఉండేలా చేసి గుండెకు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఉల్లిపాయలో స‌ల్ఫ‌ర్ తోపాటు అడెనోసిస్‌, అల్లిసిన్‌, పారాఫినిక్ పాలీస‌ల్పైడ్స్ వంటి మూల‌కాలు సమృద్దిగా ఉండుట వలన రక్తం పలుచగా ఉండేలా చేసి రక్తప్రవాహం బాగా సాగేలా చేయటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."