Healthhealth tips in telugu

ఈ జ్యూస్ తాగితే రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా అలసట, నీరసం తగ్గి తక్షణ శక్తి వస్తుంది

Immunity booster drink : వేసవికాలం ఎండలు ప్రారంభం అయ్యాయి. బయటకు వెళ్ళి వచ్చామంటే అలసట,నీరసం వచ్చేస్తాయి. ఇలాంటి సమయంలో తక్షణ శక్తిని అందించే డ్రింక్ తాగితే చాలా బాగుంటుంది. ఎండ వేడిమిని తగ్గించి శరీరాన్ని చల్లబరిచే ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
kalabanda benefits in telugu
మిక్సీ జార్ లో ఆలోవెరా పెద్ద ముక్కను కట్ చేసి గుజ్జును వేయాలి. ఆ తర్వాత రోజ్ యాపిల్ ఆరు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం నీటిని పోసి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ లో పోసి సరిపడా నీటిని పోసి బాగా కలపాలి.

దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ అన్నీ వయస్సుల వారు తాగవచ్చు. శరీరంలో వేడిని తగ్గించి చల్ల బరుస్తుంది. అంతేకాక రక్షణ వ్యవస్థ కి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ని అందించి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఈ డ్రింక్ చేసుకోవటం చాలా సులభం.

కాస్త సమయాన్ని కేటాయించి ఇంటిలో ఈ విధంగా జ్యూస్ లు తయారుచేసుకొని తాగితే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అలాగే వేసవిలో వచ్చే అలసట,నీరసం వంటివి లేకుండా హుషారుగా,ఉత్సాహంగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.