Healthhealth tips in telugu

వీటిని ఇలా తీసుకుంటే రక్తం శుద్ది అవ్వటమే కాకుండా రక్తం వృద్ది అయ్యి రక్తహీనత అసలు ఉండదు

Blood Purification : రక్తం శుద్దిగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. శారీరక,మానసిక ఆరోగ్యం బాగుండాలంటే రక్తప్రసరణ బాగా సాగాలి. శరీర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. రక్త ప్రసరణ వ్యవస్థలో కొంచెం తేడా వచ్చినా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి.. తప్పకుండా రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోడానికి ప్రయత్నించాలి.
Diabetes unnavaru bellam thinavacha
బెల్లంను చాలా మంది పంచదారకు బదులుగా వాడుతూ ఉంటారు. బెల్లంలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. మంచి రక్తాన్ని శరీరానికి అందించే శక్తి ఉంది. అలాగే శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపుతుంది. ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో చిన్న బెల్లం ముక్క తింటే సరిపోతుంది.

ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం కలిపి తాగితే రక్తం శుద్ది అవ్వటమే కాకుండా రక్తకణాల సంఖ్య కూడా పెరుగుతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపుతుంది.

రాగి పాత్రలో రాత్రి సమయంలో నీటిని పోసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. ఇలా తాగటం వలన శరీరంలో మలినలను తొలగిస్తుంది. రక్తం శుద్ది అవుతుంది. శరీరంలో ఎన్నో రకాల రుగ్మతలను తగ్గిస్తుంది.