Healthhealth tips in telugu

మొక్కజొన్న పొత్తు తిన్నాక నీటిని తాగితే ఏమి అవుతుందో తెలుసా?

Mokkajonna Health benefits : ప్రస్తుతం మొక్కజొన్న పొత్తులు చాలా విరివిగా వస్తున్నాయి. ఈ వానలలో వేడివేడిగా మొక్కజొన్న పొత్తు తింటే ఆ మజానే వేరు. అయితే మొక్కజొన్న తిన్న వెంటనే నీటిని తాగటం మంచిది కాదని నిపుణులు చెప్పుతున్నారు. వర్షాకాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మొక్కజొన్నను తాజాగా తీసుకోవాలి. మొక్కజొన్నను ఉడికించి కూడా తీసుకోవచ్చు. మొక్కజొన్నలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొక్క జొన్న తిన్న వెంటనే నీటిని తాగితే ఏమి అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొక్కజొన్న తిన్న వెంటనే నీటిని తాగటం వలన జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.
gas troble home remedies
మొక్కజొన్నలో స్టార్చ్ మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి మొక్కజొన్న తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ మరియు తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి మొక్కజొన్న తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. మొక్కజొన్న తిన్న పావుగంట తర్వాత నీటిని తాగవచ్చు.
mokkajonna
మొక్కజొన్నను ఎల్లప్పుడూ తాజాగా మరియు వేడిగా తీసుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉంచితే హానికరమైన బ్యాక్టీరియా వృద్ధికి దారి తీస్తుంది. దాంతో కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మొక్కజొన్నలో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది.మొక్కజొన్నలోని స్టార్చ్ కంటెంట్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.
Acidity home remedies
అలాగే మొక్కజొన్నను ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. మొక్కజొన్న తీసుకోవటం వలన ప్రయోజనాల విషయానికి వస్తే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది. మొక్కజొన్నలోని విటమిన్ సి మరియు కెరోటినాయిడ్స్ మెదడు మరియు నరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."