వాము+జీలకర్ర కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Ajwain Jeera Tea : వాము,జీలకర్ర రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ జీలకర్ర, అరస్పూన్ వాము వేసి రెండు గంటలు నానబెట్టి…ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు మరిగించాలి.

మరిగిన ఈ డ్రింక్ ని గ్లాసు లోకి వడకట్టి అరస్పూన్ తేనె కలిపి ఉదయం సమయంలో తాగాలి. ఈ డ్రింక్ ని పరగడుపున తాగవచ్చు…లేదంటే బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగవచ్చు. ఈ డ్రింక్ బరువు తగ్గటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. వాములో ఉండే థైమోల్ జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ రసాలను కడుపులో విడుదల చేయడంలో సహాయపడుతుంది.

వాములో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతాయి. జీవక్రియ బాగా జరిగితే చాలా తొందరగా బరువు తగ్గుతారు. జీలకర్ర జీర్ణక్రియ ఎంజైమ్లను విడుదల చేసి జీర్ణక్రియ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది.
అంతేకాక కడుపుకి సంబందించిన సమస్యలు అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

రక్త ప్రసరణ బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే దగ్గు,గొంతునొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఈ సీజన్ లో కాస్త ఎక్కువగా నొప్పులు ఉంటాయి. వాటిని తగ్గించటానికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో హీమో గ్లోబిన్ శాతాన్ని పెంచుకోవటానికి కూడా ఈ డ్రింక్ సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

