Healthhealth tips in telugu

ప్రెగ్నెన్సీ సమయంలో జీడిపప్పు తింటే తల్లీబిడ్డలకు ఇన్ని లాభాలా.. తెలిస్తే వదిలిపెట్టరు!

Cashew nuts benefits pregnancy : గర్భధారణ సమయం ప్రతి మహిళ జీవితంలో అత్యంత మధురమైనది, అలాగే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో గర్భిణీలకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ‘ప్రెగ్నెన్సీ సమయంలో జీడిపప్పు (Cashews) తినొచ్చా? తింటే వేడి చేస్తుందా? బరువు పెరిగిపోతామా?’ అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి.

వాస్తవానికి, జీడిపప్పులో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో పెరుగుతున్న శిశువు ఎముకల అభివృద్ధికి, మెదడు ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే గర్భిణీలలో వచ్చే రక్తహీనత (అనీమియా)ను, అలసటను తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి.

అయితే, జీడిపప్పును రోజుకు ఎంత మోతాదులో తినాలి? ఏ సమయంలో తినడం సురక్షితం? ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి? వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం. మీ ఆరోగ్యం, మీ బిడ్డ ఎదుగుదల కోసం ఈ సమాచారాన్ని పూర్తిగా చదవండి!”

గర్భధారణ సమయంలో తీసుకోవలసిన ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. గర్భధారణ సమయంలో జీడిపప్పు తీసుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం. ఇలాంటి ఆహారాల తీసుకునేటప్పుడు డాక్టర్, డైటీషియన్ సలహాతో తీసుకుంటే మంచిది.
Cashew nuts Benefits in telugu
జీడిపప్పులో జింక్ సమృద్ధిగా ఉండుట వలన బిడ్డలో కణాల ఉత్పత్తికి ఎంతో సహాయపడుతుంది. అలాగే జీడిపప్పులో ఉండే కాల్షియం బిడ్డ పుట్టిన తర్వాత చిగుళ్ళు, దంతాలు గట్టిగా ఉండటానికి సహాయపడుతుంది. పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన పుట్టుక లోపాలు లేకుండా చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి బాగా జరిగి రక్తహీనత సమస్య ఉండదు

గర్భధారణ సమయంలో మహిళలు బరువు తక్కువగా ఉంటే జీడిపప్పు చాలా బాగా సహాయపడుతుంది. జీడిపప్పులో ఉండే క్యాలరీలు, కొవ్వు పదార్థాలు బరువు పెరగడానికి సహాయపడతాయి. జీడిపప్పులో ఉండే విటమిన్ K గర్భిణీ శరీరంలో రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచుతుంది. సిజేరియన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇది వరంలా ఉపయోగపడుతుంది.

గర్భధారణ సమయంలో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. జీడిపప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మలబద్ధకం సమస్య అనేది ఉండదు. అలాగే కడుపులో ఉన్న బిడ్డ ఎలర్జీల బారిన పడకుండా కాపాడుతుంది. మిగతా డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవచ్చు లేదా చాక్లెట్, కేక్, స్వీట్ల రూపంలో తీసుకోవచ్చు

అయితే జీడిపప్పు అంటే పడని వారికి ఎనర్జీ రావచ్చు. అలాగే రక్తపోటు పెరగవచ్చు. అంతేకాకుండా బరువు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. పొట్ట కింద నొప్పి, తిమ్మిరిగా ఉండటం, వాంతులు వంటి సమస్యలు ఉంటే జీడిపప్పు తినడం ఆపేసి డాక్టర్ని సంప్రదించాలి. జీడిపప్పు రోజులో 4 లేదా 5 పప్పులను తింటే సరిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."