Healthhealth tips in telugu

ఈ టీ ఇలా తీసుకుంటే క్షణాల్లో నిద్ర పడుతుంది…నిద్రలేమి సమస్య జీవితంలో ఉండదు

Herbal tea For Sleep In Telugu : ఈ మధ్య కాలంలో రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర రావడం లేదని చెప్పే వారు చాలా మంది కనబడుతున్నారు. ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానం, రాత్రి సమయంలో టీవీ, స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడపడం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో నిద్ర సరిగా పట్టక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.
Drumstick leaves Health Benefits
సరైన నిద్ర లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. ఇప్పుడు చెప్పే టీ తీసుకుంటే నిద్ర చాలా బాగా పడుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడెక్కాక గుప్పెడు మునగాకు, పావు స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి, అంగుళం అల్లం ముక్కను దంచి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
Ginger benefits in telugu
ఆ తర్వాత ఈ టీ ని వడగట్టి తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. రాత్రి పడుకోవడానికి గంట ముందు తాగితే ఈ టీలో ఉన్న లక్షణాలు మంచి నిద్ర పట్టడానికి సహాయపడతాయి. అలాగే ఈ టీ తాగటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను కూడా తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు ఉన్నా సరిగా నిద్ర పట్టదు. మునగ ఆకులో ఉండే లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచి మంచి నిద్రకు సహాయపడుతుంది.
sleeping problems in telugu
మునగ ఆకులు సంవత్సరం పొడవునా లభ్యం అవుతాయి. ఈ టీ తాగటం వలన నిద్రలేమి సమస్య తగ్గటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాస్త ఓపిక చేసుకొని ఇలా చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.