Healthhealth tips in telugu

తెల్ల గుమ్మడికాయను ఎప్పుడైనా తిన్నారా….లేదంటే ఎన్నో లాభాలను మీరు మిస్ చేసుకున్న‌ట్లే..!

white pumpkin benefits In Telugu : మనం సాధారణంగా నారింజ,పసుపు,గోధుమ రంగులో ఉండే గుమ్మడికాయలను చూస్తూ ఉంటాం. ఈ గుమ్మడికాయతో కూర ,పులుసు చేస్తూ ఉంటారు. అలాగే ఈ గుమ్మడికాయలో ఎన్నో భాషకాలు., ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో చాలామందికి తెలుపు రంగులో ఉండే గుమ్మడికాయ గురించి పెద్దగా తెలియదు.
white pumpkin
ఈ తెల్ల గుమ్మడికాయలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తెల్ల గుమ్మడి కాయలో విటమిన్ ఎ, విటమిన్-బి6, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫోలేట్, నియాసిన్, థయామిన్ వంటి ఖనిజాలు కూడా సమృద్దిగా ఉన్నాయి.
cholesterol reduce foods
తెల్ల గుమ్మడికాయలో ఫైటోస్టెరాల్స్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. ట్రిప్టోఫాన్ అమైనో ఆమ్లం లోపం కారణంగా డిప్రెషన్ సమస్య వస్తుంది. తెల్ల గుమ్మడి కాయలో ఎల్-ట్రిప్టోఫాన్ సమృద్దిగా ఉండుట వలన డిప్రెషన్ సమస్యను తగ్గించి మానసిక స్థితి బాగుండేలా చేస్తుంది.
eye sight remedies
తెల్ల గుమ్మడికాయలలో లూటీన్ మరియు జియాక్సంతిన్ సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కళ్ళను రక్షించడానికి మరియు కంటిశుక్లం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడుతుంది.
తెల్ల గుమ్మడికాయలోని యాంటీఆక్సిడెంట్లు శ్వాసకోశ వ్యవస్థను ఇన్ఫెక్షన్లు మరియు ఫ్రీ రాడికల్ దాడుల నుండి రక్షిస్తాయి.
asthama
అందువల్ల ఈ సీజన్ లో ఆస్తమా సమస్య నుండి ఉపశమనం కొరకు తెల్ల గుమ్మడికాయ తింటే మంచిది. తెల్ల గుమ్మడికాయలో ఉండే ఔషధ గుణాలు జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి మరియు పనితీరును పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతాలు చేస్తాయి. అందువల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి.

తెల్ల గుమ్మడికాయలో విటమిన్లు ఎ, సి మరియు ఇ మరియు జింక్ రూపంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన చర్మానికి పోషణ అందించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే వృదాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. మొటిమలు,నల్లని మచ్చలను తొలగిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."