MoviesTollywood news in telugu

బుల్లితెర Anchor గా రావటానికి ముందు ప్రదీప్ ఏమి చేసేవాడో తెలుసా?

Anchor Pradeep Unknown Facts :యాంకర్ గా తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళుతున్న యాంకర ప్రదీప్ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసుకుందాం. ప్రదీప్ ఇంజనీరింగ్ పూర్తీ చేసి ఈవెంట్ మేనేజర్ గా పనిచేసాడు. ఆ తర్వాత రేడియో మిర్చి లో జాకీగా చేస్తూ అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక లోకల్ ఛానల్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ అవకాశం ప్రదీప్ జీవితాన్నే మార్చేసింది. ఫిమేల్ యాంకర్స్ హవా ఉన్న సమయంలో ఎంట్రీ ఇచ్చి మారి తానేమిటో నిరూపించుకున్నాడు ప్రదీప్.
Anchor Pradeep
జీ తెలుగులో ప్రసారం అయిన గడసరి అత్త సొగసరి కోడలు అనే మహిళా షో ద్వారా బుల్లితెర కి యాంకర్ గా ప్రవేశించాడు. ఆ కార్యక్రమాన్ని హిట్ చేయటంలో తన వంతు పాత్రను సక్సెస్ చేయటంతో ఆ కార్యక్రమం సూపర్ హిట్ కావటమే కాకుండా ప్రదీప్ కి సమయం లేకుండా బిజీ అవకాశాలు ఇప్పించింది. ఒక మహిళా షో కి మొదటిసారిగా మెల్ యాంకర్ యాంకరింగ్ చేసి మహిళల చేత శభాష్ అనిపించుకున్నాడు.
Pradeep Machiraju
ఆ తర్వాత ఇక ప్రదీప్ వెనుదిరిగి చూడవలసిన అవసరం లేకపోయింది. అడపా దడపా సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలను వేస్తున్నాడు. ప్రదీప్ నిర్మాతగా కూడా మారి జీ తెలుగులో ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ సక్సెస్ గా ముందుకు సాగుతున్నాడు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన మొదటి ప్రిఫరెన్స్ బుల్లితెరకే అని చెపుతున్నాడు ప్రదీప్. 

టాలీవుడ్‌లో టాప్ మేల్ యాంకర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా చేశారు. అంతకుముందు భం బోళేనాథ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, జులాయి, 100% లవ్, వరుడు లాంటి సినిమాల్లో ప్రదీప్ కనిపించాడు.