Naga Chaitanya సవ్యసాచి సినిమా ప్లాప్ కావటానికి అసలు కారణాలు ఇవే
Naga Chaitanya savyasachi movie : అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య చాలా తక్కువ సమయంలోనే సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే గతంలో వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న సమయంలో ప్రేమమ్ వంటి సినిమాతో అదిరిపోయే హిట్‌ను చైతూకు డైరెక్టర్ చందూ ముండేటి అందించాడు.
ఈ సినిమా అదిరిపోయే సక్సెస్ అందుకోవడంతో చైతూతో మరో సినిమాను తెరకెక్కించాడు చందూ ముండేటి.అయితే పూర్తి యాక్షన్ డ్రామాగా ‘సవ్యసాచి’ చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ డైరెక్టర్. కాగా ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు మంచి అంచనాలే ఉన్నా, రిలీజ్ అయ్యాక మాత్రం బోల్తా కొట్టింది.ఈ సినిమా కథ కొత్తగా ఉన్నా కమర్షియల్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సినిమా పోయిందని చిత్ర దర్శకుడు చందూ ముండేటి తాజాగా తెలిపాడు.
ఈ సినిమా ఫెయిల్యూర్‌కు పూర్తి బాధ్యత తనదేనని చైతూకి చెప్పినట్లు, దానికి ఆయన ఎలాంటి నెగెటివిటీ చూపించలేదని అన్నాడు.ఇలా ఓ సినిమాను ఫెయిల్యూర్‌గా మలిచిన దర్శకుడితో తన స్నేహాన్ని కొనసాగించడం ఒక్క చైతూకే చెందిందని చందూ ముండేటి అన్నాడు. ఇప్పటికీ తనకు చైతూతో మంచి స్నేహం ఉందని చందూ ముండేటి తెలిపాడు.

