MoviesTollywood news in telugu

Honey Rose : వీర‌సింహారెడ్డిలో న‌టించిన ఈ బ్యూటీ ఎవ‌రో తెలుసా ?

Veera Simha Reddy Movie :బాలకృష్ణ హీరోగా వీర‌సింహారెడ్డి సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో Honey Rose నటించింది. ఆమె
తెలుగులో ‘ఆలయం’ ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలు చేసిన పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమాలో పెద్ద బాలయ్యకు భార్యగా నటిస్తుంది.

ఈ సినిమాలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ పాటలో డ్యాన్స్ తోపాటు మంచి క్యారెక్టర్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చిన ‘మాన్ స్టర్’ అనే సినిమాలో నటించి మెప్పించింది. కేరళలో పుట్టిన హనీ.. 14 ఏళ్ల వయస్సులోనే సినీ పరిశ్రమకు వచ్చింది.

2005లో నటిగా మలయాళంలో తొలి సినిమా చేసిన… ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత హ‌నీ రోజ్ తెలుగులో నటిస్తుంది. ఈ సినిమా ఆమెకు ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."