Healthhealth tips in telugu

నరాల బలహీనతకు ఈ ఒక్క ఆకు చాలు! డయాబెటిస్, పక్షవాతం దరిచేరవు – ఆ ‘మ్యాజిక్’ ఆకు ఇదే!

Arugula Health leaves benefits : ఈ రోజుల్లో ఏ సమస్య వచ్చిన అసలు అశ్రద్ద చేయకూడదు. ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే వేసుకొనే మందుల మోతాదు పెరగకుండా ఉంటుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి అరుగులా ఆకు (arugula leaves) చాలా బాగా సహాయపడుతుంది.

“చాలామందికి తెలియని ఈ ‘అరుగులా’ ఆకుతో అద్భుతాలు చేయవచ్చు! నరాల బలహీనతతో బాధపడేవారికి ఇది ఒక వరం లాంటిది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా, రక్తప్రసరణను మెరుగుపరిచి పక్షవాతం వంటి ముప్పులను ఎలా అడ్డుకుంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఆ రహస్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూడండి…”

ఆధునిక జీవనశైలిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలోనే అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ‘అరుగులా’ (Arugula) ఆకులు ప్రధానమైనవి. దీనిని కేవలం సలాడ్ ఆకుగా మాత్రమే కాకుండా, ఒక సంజీవనిలా భావించవచ్చు.
Diabetes In Telugu
ఆవాలు కుటుంబానికి చెందిన ఈ ఆకు మంచి సువాసనతో ఉంటుంది. అరుగులా ఆకుల్లో విటమిన్లు ఏ,కె, బీ9, సి, ఐర‌న్, మెగ్నీషియం, అయోడిన్, కాల్షియం మరియు పొటాషియం ఉంటుంది. విటమిన్ K గ్లూకోజ్ జీవక్రియ మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. అలాగే ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, కూడా సమృద్దిగా ఉండుట వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.
Diabetes diet in telugu
ఇది ఇన్సులిన్ సెన్సిటివిటిని తగ్గిస్తుంది. అలాగే ఈ ఆకులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉండుట వలన సాదరణంగా డయాబెటిస్ రోగులలో ఉండే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.అలాగే కణాలలోకి గ్లూకోజ్ రవాణాను మెరుగుపరుస్తుంది. మంచి కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు డయాబెటిస్ కారణంగా వచ్చే న్యూరోపతిక్ సమస్యలను నివారిస్తుంది.

ఈ ఆకులను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్ గా తయారుచేసుకొని తాగవచ్చు. అంతేకాకుండా ఈ ఆకులను సలాడ్ వంటి వాటిలో వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ ఆకులను తీసుకొనే ముందు ఒక్కసారి ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడూ తీసుకొనే మోతాదు కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.
Brain Foods
ఈ ఆకును పుదీనా వాడినట్టు వాడితే సరిపోతుంది. ఈ ఆకు మెదడులోను,గుండెలోను రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏమి లేకుండా చేసి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండెకు,మెదడుకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ మొక్కను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. దీని విత్తనాలు మార్కెట్ లో దొరుకుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."