How To Stop White Hair: జుట్టు తెల్లబడకుండా ఉండటం మీ చేతుల్లోనే…
How To Stop White Hair : ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులో వచ్చేస్తుంది. దాంతో చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే రకరకాల hair dye లు వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా ఉండే కొన్ని వస్తువులతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ఈ చిట్కా కోసం ఉసిరి ముక్కలను తీసుకొని ఒక పాన్ లో వేసి పొయ్యి మీద పెట్టి సిమ్ లో 5 నిమిషాల పాటు వెగించాలి. వేగిన తర్వాత కొంచెం నీటిని పోసి ఉసిరి ముక్కలను బాగా ఉడికించాలి. ఉసిరి ముక్కలు ఉడకటానికి దాదాపుగా 7 నిమిషాల సమయం పడుతుంది. బాగా ఉడికిన ఉసిరి ముక్కలను రాత్రంతా అలా ఉంచేయాలి.
మరుసటి రోజు ఉదయం ఉడికిన ఉసిరి ముక్కలను మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఉసిరి ముక్కల పేస్ట్ లో ఒక స్పూన్ గోరింట పొడి, అరస్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలిపి తలకు పట్టించి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ వారాలు, తెల్ల జుట్టు తక్కువగా ఉన్నవారికి తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


