Kitchenvantalu

Dondakaya 65:ఆంధ్రా పెళ్లిళ్ల స్పెషల్ క్రిస్పీ దొండకాయ 65 Simple గా ఇంట్లోనే చేసుకోండి

Andhra weddings special Dondakaya 65 Recipe: ఇంట్లో చేసిన దొండకాయ అంటే ఎవరు పెద్దగా ఇష్టంగా తినరు. అదే ఏ హోటల్స్ లోనే అయితే దొండకాయ 65 ఆర్డర్ చేసుకోని మరీ తింటారు. అచ్చంగా పెండ్లీలో,హోటల్స్ లో చేసే దొండకాయ65 ఇంట్లోనే తయారు చేసేయండి.

కావాల్సిన పధార్ధాలు
లేత దొండకాయలు- ½ kg
నూనె- ఫ్రైకి సరిపడా
శెనగపిండి – ½ కప్పు
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
కారం- ½ టీస్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
అల్లం – 2 ఇంచులు
జీలకర్ర- 1 టీస్పూన్
పచ్చిమిర్చి – 7-8
పల్లీలు- ¼ కప్పు
కరివేపాకు- కొద్దిగా
జీలకర్ర పొడి- ½ టీ స్పూన్
కారం- ¾ టీ స్పూన్
గరంమసాల- ½ టీ స్పూన్

తయారి విధానం
1.నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలను నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకోని మీడియం ఫ్లేమ్ పై పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి.
2. వేడి నీళ్లలోంచి దొండకాయలను జల్లిలో వేసుకోని చల్లారనివ్వాలి.
3.ఒక మిక్సి జార్ లోకి పచ్చిమిర్చి,అల్లం వేసుకోని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4.చల్లారిన దొండకాయ ముక్కలకు అల్లం,పచ్చిమిర్చి పేస్ట్ వేసి,ఉప్పు,పసుపు,కారం,జీలకర్ర,శెనగపిండి,బియ్యం పిండి,వేసి ముక్కలను మెదపకుండా నెమ్మదిగా పిండి పట్టించుకోవాలి.అవసరం అయితే కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి.

5.మరిగే నూనె లో దొండకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ పై బాగా వేపుకోవాలి.
6.ముక్కలు రంగు మారుతున్న టైం లో స్టవ్ హై ఫ్లేమ్ లోకి మార్చుకోని కరకరలాడేలా వేపుకోని పక్కన తీసుకోవాలి.
7.అదేనూనెలో పల్లీలు,కరివేపాకు వేసి వేపుకోని దొండకాయ ముక్కల్లో వేసుకోవాలి.
8.ఇప్పుడు అందులోకి ఉప్పు,కారం,జీలకర్ర పొడి,గరంమసాల వేసి టాస్ చేసుకుంటే దొండకాయ 65 రెడీ అయినట్టే.
Click Here To Follow Chaipakodi On Google News