Kitchenvantalu

Rava Kesari:కేవలం 10 నిమిషాల్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరి.. పక్కా కొలతలతో

Rava Kesari: ఏ పూజకైనా,పండుగకైనా,శుభకార్యానికైనా ముందుగా కనిపించే స్వీట్ ప్రసాదం రవ్వ కేసరి. ఇంట్లో ఉండే ఐటమ్స్ తో ఈజీగా చేసుకునే రవ్వకేసరి.. రవ్వకేసరి ఎలా తయారు చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
బొంబాయ్ రవ్వ – 1 కప్పు
పంచదార – 1.5 కప్పు
నెయ్యి – ¾ కప్పు
వేడినీళ్లు – 3 కప్పులు
జీడిపప్పులు – 15
కిస్మిస్ – 15
యాలకుల పొడి – ¼ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని సగం నెయ్యి వేసి అందులోకి జీడిపప్పులు,కిస్మిస్ లు ,రవ్వ వేసి సన్నని సెగ పై దోరగా వేపుకోవాలి.
2.వేగిన రవ్వలో వేడి నీళ్లు పోసి రవ్వని దగ్గర పడనివ్వాలి.
3.రవ్వ మెత్తగా ఉడుకుతున్నన సమయంలో పంచదార వేసి మరింత దగ్గరికి ఉడకనివ్వాలి.
4.దగ్గర పడ్డ రవ్వలో ఎల్లో ఫుడ్ కలర్ ,యాలకుల పొడి,మిగిలిన నెయ్యి,వేసి కలిపి నెయ్యి పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ పై ఉడకనివ్వాలి.
5.అంతే ఘుమ ఘుమలాడే రవ్వ కేసరి తయారైనట్టే.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."