Kitchenvantalu

Palak Pesarattu:పాలకూరతో రుచికరమైన పెసరట్టు.. ఇది ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్

Palak Pesarattu:పాలకూర పెసరట్టు.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ అనేది హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. ఎంత హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి. ప్రోటీన్స్ పుష్కలంగా అందించే పెసరట్టుకి కాసింత పాలకూర జోడించి చూడండి.పాలకూర పెసరెట్టు ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
పెసలు – 1 కప్పు
బియ్యం – 3 టేబుల్ స్పూన్స్
పాలకూర – 1 కప్పు
అల్లం ముక్కలు – కొద్దిగా
పచ్చిమిర్చి – 2-3
జీలకర్ర – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ముందుగా పెసలు,బియ్యాన్ని నాలుగు ,ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2.నానిన పప్పులోకి అల్లం ముక్కలు,పచ్చిమిర్చి,కడిగిన పాలకూర ,జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి.
3.గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ లోకి అవసరం అయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి.
4.ఇప్పుడు అట్టుకోసి ప్యాన్ వేడి చేసి దోసను వేసి పెనం పై స్ప్రెడ్ చేసుకోవాలి.
5.అట్టు పై నూనె కాని ,బటర్ కాని వేసి దోరగా కాల్చుకోవాలి.
6.కావాలంటే తరిగిన ఉల్లిపాయలు చల్లుకోని సర్వ్ చేసుకోవడమే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."