Corn Fried Rice:స్వీటీకార్న్ తో కమ్మటి, రుచికరమైన కార్న్ ఫ్రైడ్ రైస్.. పిల్లలకి ఎంతో నచ్చుతుంది
Corn friedRice:కార్న్ ఫ్రైడ్ రైస్.. కార్న్ తో చేసే ఏ స్పెషల్స్ అయినా అదిరిపోయే రుచితో ఉంటాయి. ముఖ్యంగా రైస్ తో మిక్సి చేసి చూడండి ఒక్క ముద్ద కూడా విడిచి పెట్టకుండా తినేస్తారు.
కావాల్సిన పదార్ధాలు
స్వీట్ కార్న్ –
వండిన అన్నం – 1 ½ కప్పు
క్యారెట్ ముక్కలు- ¼ కప్పు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 3
కరివేపాకు – ½ కప్పు
ఉప్పు – 1 టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 3
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని టీ స్పూన్ బటర్ లేకా నెయ్యిని వేసి వేడిచేసుకోవాలి.
2.అందులోకి ఉల్లిపాయ తరుగు,వెల్లుల్లి రెబ్బలు,పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
3.క్యారేట్ తురుము,కరివేపాకు,కార్న్ వేసి ఫ్రై చేసుకోవాలి.
4.రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక అందులోకి మిరియాల పొడి,గరంమసాలా వేసి ఉడికించిన అన్నం వేసి కలుపుకోవాలి.
5.చివరగా కొత్తిమీర చల్లుకోని అన్నాన్ని బాగా టాస్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.


