Kitchenvantalu

Green Peas Pulao:పచ్చి బఠాణీతో ఇలా పులావ్ చేసుకోండి.. చాలా టేస్టీగా ఉంటుంది

Green Peas Pulao:గ్రీన్ పీస్ పలావ్.. స్పెషల్ అంటే పులావ్ అనే చెప్పాలే. వీకెండ్స్ రెసిపీలో బిర్యానీ,పలావ్,ఫ్రైడ్ రైస్ ఏదో స్పెషల్ ఉండాల్సిందే. ఈ వీకెండ్ కి పచ్చి బఠానీ తో పలావ్ చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
బాస్మతి బియ్యం – 2 కప్పులు
పచ్చి బఠానీలు – ½ కప్పు
టమాటోలు – 2
బంగాళదుంప – 1
పచ్చిమిర్చి – 2
పుదీనా – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
హోల్ గరం మసాలా – తగినంత
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.బాస్మతి బియ్యాన్ఇన అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి నెయ్యివేసి వేడి చేసుకోవాలి.
3.అందులోకి హోల్ గరం మసాలా వేసి వేగాక ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
4.తరిగిన పచ్చిమిర్చి,బంగాళదుంపలు,టొమాటోలు,వేసి మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి.
5.అల్లం వెల్లుల్లి పేస్ట్,పసుపు,కారం ,ఉప్పు,ధనియాల పొడి వేపి కలుపుకోవాలి.

6.తర్వాత పుదీనా,పచ్చిబఠానీలు వేపి ఐదు నిమిషాల పాగు మూత పెట్టి వేపుకోవాలి.
7.ఇప్పుడు నాలుగు కప్పుల నీళ్లను వేసి ఎసరు మరిగించాలి.
8.మరుగుతున్న ఎసరులో కొత్తిమీర తరుగు,నానబెట్టుకున్న బియ్యం,వేసి పదినిమిషాలు హై ఫ్లేమ్ పై ఉడికించి మద్య మద్యలో కలుపుతూ ఉండాలి.
9.ఇప్పుడు మూత వేసి తక్కువ మంట పై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
10.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
11.అంతే గ్రీన్ పీస్ పలావ్ రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."