Kitchenvantalu

Bellam Gavvalu:బెల్లం గవ్వలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే పిండిని ఇలా కలిపి చూడండి

Bellam Gavvalu:బెల్లం గవ్వలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే పిండిని ఇలా కలిపి చూడండి….చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్దాలు
గోధుమ పిండి– 500గ్రా,బొంబాయిరవ్వ– 100గ్రా,నెయ్యి– 120గ్రా,బెల్లం– 150గ్రా,గుడ్డు-1,యాలకులు -5 గ్రా,బేకింగ్‌పౌడర్‌– చిటికెడు,రిఫైన్డ్‌ఆయిల్‌– వేయించడానికి తగినంత

తయారుచేసేవిధానం
ఒక గిన్నెలో కోడిగుడ్డు సొనను తీసుకోని స్పూన్‌తో బాగా గిలకొట్టాలి. అందులో బెల్లం కూడా వేసి పూర్తిగా కరిగించాలి. అవసరమైతే ఒక కప్పు నీళ్లు కూడాపోయాలి. అందులో యాలకుల పొడిని కూడా చేర్చి ఈ మిశ్రమాన్ని పక్కనపెట్టాలి.

ఇప్పుడు గోధుమ పిండిలో బేకింగ్‌ సొడా కలిపి జల్లించాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకోని బొంబాయిరవ్వ, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. దీనికి కోడిగుడ్డు మిశ్రమాన్ని చేర్చి గట్టిగా పూరీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా అంటే చిన్నగోలిసైజులో చేసి ఉంచాలి.

గవ్వల చెక్కెపై బొటన వేలితో పిండిని గట్టిగా అదుముతూ వేలును కిందికి జరపాలి. పిండి చుట్టుకొని గవ్వ తయారవుతుంది. ఈ విధంగా తయారైన గవ్వలను కాగుతున్న నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."