Kitchenvantalu

Onion Uttapam : ఉల్లిపాయ ఊతప్పంను ఇలా చేస్తే.. చాలా రుచిగా ఉంటుంది..

Onion Uttapam : ఉల్లిపాయ ఊతప్పంను ఇలా చేస్తే.. చాలా రుచిగా ఉంటుంది..వేసవి కాలంలో ఉల్లిపాయ ఎక్కువగా తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఉల్లిపాయతో ఊతప్పం చేసుకొని బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు
ఉప్పుడు బియ్యం 500 గ్రాములు
మినపప్పు 100 గ్రాములు
చిన్న ఉల్లిపాయలు తగినన్ని
ఉప్పు తగినంత
నువ్వుల నూనె తగినంత

తయారి విధానం
ఉప్పుడు బియ్యం మరియు మినపప్పుని విడివిడిగా రెండు గంటలసేపు నానపెట్టుకోవాలి. బియ్యం మరియు మినపప్పుని విడివిడిగా రుబ్బుకోవాలి.ఇలా రుబ్బుకున్న రెండు పిండ్లు కలుపుకొని, ఈ మిశ్రమానికి ఉప్పు కలిపి రాత్రంతా ఉంచాలి.

ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు గా కోసుకోవాలి.దోశల పెనం వేడి చేసి, ఒక గరిటెడు పిండి తీసుకొని గుండ్రంగా పరచాలి.ఉల్లిపాయ ముక్కలు దోశ మొత్తంమీద చల్లాలి.దోశ అంచుల మీద కొద్దిగా నూనె చల్లుకొని, చిన్న మంటమీద ఉంచాలి.దోశని తిప్పి, ఎర్రగా కాలనివ్వాలి.మంట మీద నుంచి తీసి వేడి వేడిగా వడ్డించండి.