Kitchenvantalu

Dondakaya Pachadi:దొండకాయ పచ్చడి ఇలాచేస్తే అన్నం లోకి రుచిగా ఎంత బాగుంటుందో..

Dondakaya Pachadi:దొండకాయ పచ్చడి ఇలాచేస్తే అన్నం లోకి రుచిగా ఎంత బాగుంటుందో..దొండకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.దొండకాయ రోటి పచ్చడి అన్నం టిఫిన్స్ లోకి సూపర్ కాంబినేషన్..

కావాల్సిన పదార్ధాలు
దొండకాయలు 1 కేజిపసుపు 1 టీస్పూన్కారంపొడి 100 గ్రా.లుజీలకర్రపొడి 2 టీస్పూన్లుమెంతిపొడి 1/2 టీస్పూన్నూనె 200గ్రాములుఅల్లం వెల్లుల్లి 100 గ్రా.లుఇంగువ 1/4 టీస్పూన్ఆవపొడి 50 గ్రా.లు.ఉప్పు 250 గ్రా,లుజీలకర్ర, మెంతులు 1 టీస్పూన్

తయారు చేయు విధానం
దొండకాయలను కడిగి, తడి లేకుండా తుడిచి నిలువుగా నాలుగు ముక్కలు చేసుకోవాలి. ఒక గిన్నెలో కారంపొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, ఆవపొడి, ఉప్పు, పసుపు వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి కాస్త ఎర్రబడ్డాక దించేయాలి.

నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న పొడులు, దొండకాయ ముక్కలు వేసి బాగాఎత్తుకోవాలి. మరునాటి నుండి తినడానికి వేసుకోవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."