Kitchenvantalu

Paneer Noodles:రెస్టారెంట్ స్టైల్ లో పనీర్ నూడుల్స్.. చాలా సింపుల్ గా..

Paneer Noodles:రెస్టారెంట్ స్టైల్ లో పనీర్ నూడుల్స్.. చాలా సింపుల్ గా..పనీర్ తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కొంత మంది పనీర్ ని ఇష్టపడరు. అలాంటి వారు ఇలా తినవచ్చు.

కావలసిన పదార్దాలు :
పనీర్ ముక్కలు 200 గ్రాములు
వెజ్ నూడుల్స్ 250 గ్రాములు
నూనె 50 గ్రాములు
తురిమిన ఉల్లికాడలు 1/2 కప్పు
క్యారట్ ముక్కలు 50 గ్రాములు
బీన్స్ ముక్కలు 50 గ్రాములు
టొమాటో సాస్ 2 స్పూన్స్
రెడ్ చిల్లీసాస్ 1 స్పూన్
వెల్లుల్లి ముద్ద 2 స్పూన్స్
సోయాసాస్ 1 స్పూన్
తురిమిన కొత్తిమిర 1స్పూన్
మిరియాల పొడి 1/4 స్పూన్
అజినోమోటో 1/4 స్పూన్
ఉప్పు తగినంత

తయారి విధానం:
సన్నగా, నిలువుగా కోసిన పనీర్ ముక్కల్ని కొద్దిపాటి నూనెలో వేయించాలి. కళాయిలో నూనె వేడి చేసి వెల్లుల్లి ముద్ద, ఉల్లికాడల తురుము, కొద్దిగా ఉడికించిన బీన్స్, క్యారట్,పనీర్ ముక్కలు వేసి కలపాలి. తర్వాత టొమాటో,చిల్లీ,సోయా సాస్ , మిరియాలపొడి, అజినోమోటో, తగినంత ఉప్పు వేసి సన్నపాటిసెగపై బాగా కలియ బెట్టాలి. చివరగా ఉడికించి వార్చి పెట్టుకున్న నూడుల్స్ కూడా వేసి బాగా కలిపి కొత్తిమిర చల్లి వడ్డించాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."