Movies

సావిత్రి గురించి రమాప్రభ చెప్పిన నమ్మలేని నిజాలు

మహానటి సినిమా విడుదల అయ్యి మూడు వారాలు దాటిపోయినా ఆ సినిమాపై ఆసక్తి తగ్గకపోవడంతో సావిత్రి గురించి ఆమె జీవితం గురించి, బయటకు రాని విషయాల గురించి మరియు అనేక ఆసక్తికరమైన వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ హాస్య నటి రమాప్రభ మిడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసారు. సావిత్రిని మోసం చేసింది ఎవరనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ సావిత్రిని ఎవరు మోసం చేయలేదని, తనకు తానే మోసపోయిందని షాకింగ్ కామెంట్స్ చేసింది రమాప్రభ.

సావిత్రి చివరి రోజుల్లో జెమిని గణేశన్ మొదటి భార్య కూతురు సావిత్రిని ఆసుపత్రిలో ఉంచిందనే విషయం తెలుసునని, సావిత్రికి మద్యాన్ని ఎవరు అలవాటు చేయలేదని తనకు తానుగా మద్యానికి బానిసగా మారిందని రమాప్రభ తెలిపారు.

సావిత్రికి ఎంత మంచి మనస్సు ఉందో అంతే మొండితనం ఉందని అందుకే అన్ని కష్టాలు పడిందని, మొత్తానికి ఆమె చేసిన తప్పులే ఆమె జీవితాన్ని బలి తీసుకున్నాయని చెప్పింది రమాప్రభ. సావిత్రి జీవితంలో ఉన్నతిని చివరి దశలో పడిన బాధలను దగ్గర ఉండి చూసిన వ్యక్తి రమాప్రభ.

సావిత్రి చివరి రోజుల్లో కూడా సావిత్రికి రమాప్రభ చాలా సన్నిహితంగా ఉన్నారు. రమాప్రభ సావిత్రిని పొగుడుతూనే మరోవైపు ఆమె జీవితం ఆలా కావటానికి సావిత్రి కారణమని చెప్పుతుంది. మహానటి సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సమయంలో సావిత్రి వ్యక్తిగత జీవితం మరల చర్చకు వస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."