Kitchenvantalu

Keera Lassi:వేసవిలో శరీరంలో వేడి తాపాన్ని తగ్గించే కీరా లస్సీ…

Keera Lassi:వేసవిలో శరీరంలో వేడి తాపాన్ని తగ్గించే కీరా లస్సీ… వేసవికాలంలో శరీరాన్ని చల్లబరిచే పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. కీరా వేసవిలో మన శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది. ఇక కీరా లస్సి ఎలా తయారుచేయాలో చూద్దాం.

కావలసిన పదార్దాలు
కీర దోసకాయ – 1
తాజా పెరుగు – ఒక కప్పు
అల్లం – చిన్నముక్క
తరిగిన కొత్తిమీర – 2 స్పూన్స్
కరివేపాకు రెబ్బలు – మూడు
ఇంగువ – చిటికెడు
చిన్న పచ్చిమిరపకాయ (కారాన్ని ఇష్టపడేవాళ్లు వేసుకోవచ్చు)
పంచదార – అర టీ స్పూను (తీపి ఇష్టపడేవాళ్లు వాడొచ్చు)
చల్లటి నీళ్లు – రెండు కప్పులు
రుచికి సరిపడా ఉప్పు

తయారీవిధానం
ముందుగా కీర దోసకాయను శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. అల్లం, పచ్చి మిరపకాయల్ని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ బ్లెండర్‌లో కీరా ముక్కలు, అల్లం, పచ్చి మిరపకాయ ముక్కలు, ఉప్పు, పంచదార, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీరలు వేసి బాగా కలిసేవరకు తిప్పాలి. తరువాత ఈ మిశ్రమానికి పెరుగు, చల్లటి నీళ్లు కలిపి మరోసారి తిప్పాలి. ఇది వేసవికాలంలో చాలా చల్లగా,హాయిగా ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."