Banana Barfi:అరటి పండు తో ఈ కొత్త రెసిపీ ని ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీ గా ఉంటుంది
Banana Barfi :పిల్లలకు స్వీట్లు అంటే ఎంతో ఇష్టం. ప్రతిసారీ బయట అమ్మే స్వీట్లు పెట్టే కన్నా ఇంట్లోనే స్వీట్లు తయారుచేసి పెట్టటం మంచిది. ఈ రోజు బనానా బర్ఫీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. దీన్ని తీయటి అరటి పండ్లతో చేస్తారు. ఈ బర్ఫీ రెసిపీ చాలా సులువు. పైగా రుచిగా ఉంటుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
– అరటి పండ్లు – 3 (ముక్కలుగా కట్ చేసి మిక్సీలో గుజ్జుగా చేయాలి)
– కొబ్బరి తురుము – 1½ కప్పు
– నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
– మిల్క్ పౌడర్ – 1 కప్పు
– బెల్లం తురుము – ¾ కప్పు
– ఏలకుల పొడి – ½ టీస్పూన్
– చిక్కటి పాలు – ¼ కప్పు (మరిగించినవి)
– బాదం – గార్నిష్ కోసం
తయారీ విధానం:
ఒక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం తురుము, పాలు వేసి, స్టవ్ మీద సిమ్ ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం కొంచెం గట్టిపడే సమయంలో నెయ్యి, అరటి గుజ్జు, మిల్క్ పౌడర్, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమం పూర్తిగా గట్టిపడిన తర్వాత, ఒక పాత్రలోకి తీసి, జీడిపప్పు, బాదం ముక్కలతో అలంకరించి, 3-4 గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లారిన తర్వాత కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. ఈ బనానా బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. ఒక సారి ట్రై చేయండి.
స్వీట్ తినాలని అనిపించినప్పుడు చక్కగా అరటిపండుతో ఇలా చేసుకుంటే సరి. స్వీట్ తినాలనే కోరిక తీరుతుంది. దానితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

