Devotional

Vinayaka chavithi 2025 : వినాయక చవితి వచ్చేసింది…వినాయకడి పూజకు అవసరమైన సామాగ్రి ఇవే!

Vinayaka chavithi 2025 : వినాయక చవితి వచ్చేసింది…వినాయకడి పూజకు అవసరమైన సామాగ్రి ఇవే.. వినాయక చవితి సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా గణపతి పూజ కోసం ఆలయాలు సిద్ధమవుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా గణనాథుడిని ఊరూ వాడా భక్తి, శ్రద్ధలతో పూజించనున్నారు. ఈ నేపథ్యంలో పూజకు అవసరమైన సామాగ్రి గురించి తెలుసుకుందాం!

వినాయక చవితి పూజా సామాగ్రి
వినాయకుడి ప్రతిమ, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూల దండలు, తమలపాకులు, అరటిపండ్లు, వక్కలు, కర్పూరం, అగరబత్తులు, గంధం, కొబ్బరికాయలు, బెల్లం, తోరము, దీపారాధన కుందులు, వత్తులు, నెయ్యి, పంచామృతం, పత్రి, ఉండ్రాళ్ళు, కర్పూర బిళ్లలు, అగ్గిపెట్టె, ఆచమనం కోసం పంచపాత్ర, ఉద్ధరిణి, కలశం కోసం చెంబు, నీళ్లు, వినాయకుడి ఆసనం, వినాయకునికి వస్త్రం, మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలు. ఇవి కాకుండా, మరికొన్ని ఇతర సామాగ్రి కూడా పూజకు అవసరం కావచ్చు.

వినాయకుడి పూజకు 21 పత్రాలు
గణనాథుడి పూజలో పత్రి చాలా ముఖ్యం. వీలైతే 21 రకాల పత్రాలను సేకరించడం ఉత్తమం. అవి: మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం (మారేడు దళం), దూర్వారయుగ్మము (గరిక), దత్తూర పత్రం, బదరీ పత్రం (రేగు ఆకు), అపామార్గపత్రం, తులసీపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుకాంతపత్రం, దాడిమీపత్రం, దేవదారుపత్రం, మరువకపత్రం, సింధువారపత్రం, జాజీపత్రం, గండకీపత్రం, శమీపత్రం, అశ్వత్తపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం.

హైదరాబాద్‌లో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సంతోషకరమైన వార్తను వెల్లడించింది. నగరంలో 34 ప్రాంతాల్లో పర్యావరణ అనుకూల మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఆగస్టు 24 నుంచి ఆగస్టు 26 వరకు ఈ విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. మొత్తం లక్ష విగ్రహాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. 2017 నుంచి పీవోపీ విగ్రహాల వినియోగాన్ని తగ్గించేందుకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది.

గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ