Movies

దిల్ రాజు ఆస్తులు, సినిమా సంపాదన ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు అని చెప్పగానే బోల్డంత డబ్బు ఉంటుందని అనుకోవడం సహజం. అలా అని అందరూ కుబేరులు కాదు,. అయితే కొందరు మాత్రం కోట్లకు పడగలెత్తుతారు. అలాంటి జాబితాలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒకరు. శతమానం భవతి,నేను లోకల్,డీజే,ఫిదా సినిమాల ద్వారా ఈ ఏడాది వంద కోట్ల రూపాయల లాభం వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి.ఇక ఆయన మొన్నటి దాకా అప్పుల్లో ఉన్నారని అనేవారు. అయితే అది ఏమాత్రం నిజం కాదని, తొమ్మిదేళ్ల క్రితమే ఆయన ఆస్తుల విలువ వెయ్యికోట్ల వరకూ ఉండేదని ఆయన గురించి బాగా తెల్సిన వాళ్ళు అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం, వారసత్వంగా కాకుండా, సినిమాలు,రియల్ ఎస్టేట్ ద్వారానే దిల్ రాజు డబ్బులు కూడబెట్టారని చెబుతుంటారు. మొదట్లో డిస్ట్రిబ్యూటర్ గా విరాజిల్లిన ఆ తరువాత నిర్మాతగా మరీనా దిల్ రాజుకి పట్టిందల్లా బంగారమే అయిందని చెప్పాలి.

కోట్లకు పడగలెత్తిన దిల్ రాజు సినీ లాభాలను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి అక్కడ కూడా బానే సంపాదించారని చాలామంది చెప్పేమాట. ఆయన బంధువులు శిరీష,లక్ష్మణ్ లు రియల్ ఎస్టేట్ రంగాన్ని చూసేవారు.అయితే 9 ఏళ్లుగా సినిమాలే జీవితంలా భావించడం వలన ఈ స్థాయికి చేరారని అంటారు. పెద్ద నిర్మాతగా ఎదిగినా, ఇప్పటికీ చాలా విషయాలు ఆయనే దగ్గరుండి చూసుకుంటారని చాలామంది చెబుతూ ఉంటారు. ఇక కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో నిర్మాతల అందరికన్నా దిల్ రాజు ముందు వరుసలో వుంటారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."