Movies

మరో ఘోర రోడ్డు ప్రమాదం … ప్రముఖ టీవీ నటుడు కారు యాక్సిడెంట్

తెలుగు టివి రంగంలో సీరియల్స్ ఎంతమందిని అభిమానులుగా మార్చుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని సంవత్సరాల పాటు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని కట్టి పాడేసిన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ గుర్తు ఉందా? హిందీలో సూపర్ డూపర్ హిట్ అయినా బాలికా వధూ సీరియల్ ని తెలుగులో డబ్ చేసి ప్రసారం చేసారు. ఈ సీరియల్ విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్ లో లీడ్ రోల్ పోషించిన సిద్దార్ధ్ శుక్లా కారు ఏక్సిడెంట్ చేసాడు. సిద్దార్ధ్ స్పీడ్ డ్రైవింగ్ కారణముగా మూడు కారులను గుద్దేసాడు. ఒకరికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. శుక్రవారం రాత్రి సిద్దార్ద్ కారు డ్రైవ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా పట్టు తప్పి నియంత్రణ కోల్పోయి ముందు ఉన్న కారులను ఢీకొట్టారు.

అనంతరం ఒక స్థంబానికి డీకొని సిద్దార్ధ్ కారు ఆగిపోయింది. ఈ ఘటనను తెలుసుకొని వచ్చిన పోలీసులు సిద్దార్ధ్ కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారు. ఈ ఘటనలో సిద్దార్ద్ కి ఎటువంటి గాయాలు అవ్వలేదు. అంతేకాక కారు మూడు కారులను ఢీకొట్టిన సిద్దార్ధ్ కారులో ఎయిర్ బాగ్స్ ఓపెన్ కాలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."