Politics

ఇంట‌ర్నెట్ ద్వారా డ‌బ్బు సంపాదించ‌డం ఎలా?

1. యూట్యూబ్ ద్వారా డ‌బ్బు సంపాదించ‌డం జియో 4జీ నెట్ ప్ర‌భంజ‌నం మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి మ‌నోళ్లు వీడియోలు చూడ‌టం బాగా ఎక్కువైంది. మ‌నం రోజూ YouTube లో వీడియో చూస్తూ వుంటాం కదా ? అలా మ‌నలో ఉన్న‌ ప్రతిభ ను వీడియో ల రూపం లో బయటపెట్టి , డబ్బు సంపాదించేయ వచ్చు. గూగుల్ యాడ్‌సెన్స్ కేవ‌లం ఒక రోజు లోపే అప్రూవ్ అవుతుంది. దీనిలో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌టానికి ఏమీ ఉండ‌దు. వీడియోలు త‌యారుచేసి Upload చేయడమే మ‌న ప‌ని. మ‌న‌కు ఉన్న టాలెంట్ ఏదైనా ఇమేజ్‌ల‌ను వీడియో చేసి లేదా ప్ర‌త్య‌క్షంగా షార్ట్ ఫిల్మ్ లాంటి వీడియోల‌ను త‌యారుచేసి అప్‌లోడ్ చేయొచ్చు. అయితే వీడియోలు మ‌న సొంత వీడియోలు అయి ఉండాలి. ఇత‌ర యూట్యూబ్ వీడియోలు, వేరే టీవీ చానెళ్ల వీడియోలు డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి పెట్ట‌కూడ‌దు. మ‌న మొబైల్ లేదా వీడియో కెమెరాతో Shoot చేసిన మన సొంత వీడియో లు , లేదా మన కంప్యూటర్ లో Screen Recording software ద్వారా చేసిన వీడియోల‌ను త‌యారుచేయ‌వ‌చ్చు. మ‌న‌కు సొంతంగా రెండు YouTube ఛాన‌ళ్లు ఉన్నా కూడా, ఒక చాన‌ల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలు మరొక చాన‌ళ్‌లో అప్లోడ్ చేయ‌కూడ‌దు.


2. సొంత వెబ్‌సైట్ (డిజైనింగ్, డిజిట‌ల్ మార్కెటింగ్‌) చాలా మంది సొంత వెబ్‌సైట్ అన‌గానే వెబ్‌సైట్ పేరు కొనుక్కోవాలి, మ‌ళ్లీ దానికి హోస్టింగ్‌, మెయింటెనెన్స్ ఖ‌ర్చులు ఇలా అనుకుంటూ ఇది మ‌న‌తో అయ్యే ప‌నికాదు అని భావిస్తారు.ఇప్పుడు కొంత సాంకేతిక విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారికి వెబ్‌సైట్ త‌యారుచేసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. Google బ్లాగర్ మాదిరిగా WordPress లో కూడా బ్లాగు ను తయారు చేసుకోవచ్చు. Google బ్లాగర్ బ్లాగు ఎలా తయారు చేయాలో చూడండి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వెబ్‌సైట్ల‌లో దాదాపు 30% వెబ్‌సైట్లు వ‌ర్డ్‌ప్రెస్‌(WordPress)లో ఉన్నాయి. మొద‌టి వ‌ర్డ్ ప్ర‌స్ బ్లాగ్ 2013లో ప్రారంభించ‌బ‌డింది. దీనిలో ల‌భ్య‌మ‌య్యే కొన్ని వంద‌ల ఫ్రీ, ప్రీమియం టెంప్లేట్‌ల ద్వారా మ‌న‌కు న‌చ్చిన టెంప్లేట్ ఎంచుకొని బ్లాగుని అందంగా తీర్చిదిద్దుకోవ‌చ్చు. ఇంకా ఇంట‌ర్నెట్లో వేల‌కొద్దీ ఉచిత ప్ల‌గ్ఇన్‌లు ల‌భ్య‌మ‌వుతాయి. వీటి ద్వారా బ్లాగుని ఆక‌ర్ష‌ణీయంగా మార్చుకోవ‌చ్చు. అందులో మీకు ప్రావీణ్యం ఉన్న కంటెంట్‌ను పెట్ట‌డం ద్వారా గూగుల్ యాడ్స్‌ను తెచ్చుకోవ‌చ్చు. ఈ విధంగా వీక్ష‌కుల సంఖ్య‌ను పెంచుకోవ‌డం ద్వారా యాడ్ రెవెన్యూ సంపాదించ‌వ‌చ్చు.