శ్రీముఖి ఎవరి కూతురో తెలుసా? నమ్మలేని నిజాలు

యాంకర్ శ్రీముఖి చిన్ని చిన్న పాత్రల్లో సినిమాల్లో నటించి ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్ తో బాగా పాపులర్ అయ్యింది.. తన అందచందాలతో ప్రస్తుతం బుల్లితెర మీద సత్తా చాటుతోంది. అయితే శ్రీముఖి డాక్టర్ కాబోయి యాంకర్ అయ్యిందట.. డాక్టర్ కావాలన్న తన కల అలానే ఉండిపోయిందని వాపోతోంది.డాక్టర్ కోసం ఎంసెట్ కు బాగా కష్టపడి చదివిందట.. కానీ అనుకోకుండా చదువు పక్కనపెట్టి యాంకర్ గా మారిపోవాల్సి వచ్చింది. అసలు ఆమె యాంకర్ గా అవతారమెత్తడమే చాలా నాటకీయ పరిణామాల మధ్య జరిగిందట.. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..శ్రీముఖి స్వస్థలం తెలంగాణలోని నిజామాబాద్.. ఈమె 10 మే 1993లో నిజామాబాద్ లో జన్మించింది. వారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లీ బ్యూటీషియన్. వీళ్ల ఫ్యామిలీ చాలా ఏళ్ల కిందటే నిజామాబాద్ వచ్చి సెటిలైంది.

శ్రీముఖి మాటలు చూసి అందరూ ఈ ముద్దుగుమ్మ తెలుగమ్మాయి అనుకుంటాం కానీ.. ఆమె నార్త్ ఇండియన్ ఫ్యామిలీ అట.. చదువుల్లో శ్రీముఖి మంచి మార్కులు తెచ్చుకునేది. పదోతరగతి లో శ్రీముఖి 95శాతం మార్కులతో పాసైందట. ఆ తర్వాత డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంటర్ లో చేరి.. ఎంసెట్ కోసం కష్టపడి చదివింది. ఐతే ఎంబీబీఎస్ సీటుకు అవసరమైన ర్యాంకు రాకపోవడంతో బీడీఎస్ లో చేరింది..

బీడీఎస్ సెకండియర్ లో ఉన్నప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే హోం మినిస్టర్ కార్యక్రమానికి స్నేహితుతో కలిసి హాజరవడం.. అక్కడ ప్రోగ్రాం డైరెక్టర్ చూసి యాంకర్ గా ట్రై చేయమని అడగడం.. తర్వాత ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించడం.. ఈటీవీలో వచ్చే అదుర్స్ ప్రోగ్రాంకు శ్రీముఖి యాంకరింగ్ చేసి మంచి పేరు సంపాదించడం.. ఆ తర్వాత మరిన్ని ప్రోగ్రాములతో బిజీ కావడం చకచకా జరిగిపోయాయి.

యాంకర్ గా ఎంట్రీ అయినప్పుడే శ్రీముఖి సినిమాల్లో అవకాశం వచ్చింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్రలో నటించింది. ఆ తర్వాత పలు చిన్న చిత్రాల్లో కూడా అవకాశాలు రావడంతో హీరోయిన్ గా మెప్పించింది. సినిమా అవకాశాలు తగ్గడంతో ఇక తర్వాత బుల్లితెరపై చలాకీ యాంకర్ గా అందరి మదిని దోచేస్తోంది. దుబాయ్ లో సైబా ప్రోగ్రాంకు యాంకరింగ్ చేసి ఆకట్టుకుంది.

ఇక శ్రీముఖికి యాంకర్ రవితో ఎఫైర్ ఉందని చాలా గాసిప్పులు ఉన్నాయి. లాస్య తర్వాత యాంకర్ శ్రీముఖితో కలిసి రవి పటాస్ ప్రోగ్రాం చేస్తుండడం.. అందులో ఇద్దరూ కలిసి రోమాంటిక్ రోల్స్ చేస్తుండడం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు పుట్టాయి. కానీ దీనిపై రవి కానీ, శ్రీముఖి కానీ క్లారిటీ ఇవ్వలేదు.