Movies

తేజస్వి మదివాడ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు రాణించి ముందుకు సాగటం అంటే కత్తి మీద సాము లాంటిదే. అలాంటి తరుణంలో ఒక తెలుగు అమ్మాయి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు తేజస్వి మదివాడ. తేజస్వి రామ్ గోపాల్ వర్మ సినిమా ఐస్ క్రీమ్ లో అదిరిపోయే రేంజ్ లో అందాలు ఆరబోసి అందరి చూపు ఆమె వైపు పడేలా చేసుకోవటంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు తేజస్వి బిగ్ బాస్ 2 లో సెలక్ట్ అయ్యి మరల అందరి దృష్టిని ఆకర్షించింది. తేజస్వి హైదరాబాద్ కి చెందిన అమ్మాయి. 1991 జులై 3 న జన్మించింది. తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తేజస్వికి ఒక సోదరుడు ఉన్నాడు. తేజస్వి ఎప్పుడు నటి అవ్వాలని అనుకోలేదు.

అసలు ఆమె ఎప్పుడు నాటకాల వైపు కూడా తొంగి చూసింది లేదు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో గ్రాడ్యుయెషన్ చేసాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో MA చేయాలనీ అనుకుంది.

అయితే డిగ్రీ చివరి సంవత్సరంలో సినిమాలో అవకాశం రావటంతో సినీ రంగంలోకి ఎంటర్ అయ్యిపోయింది. హార్ట్ ఎటాక్, అను క్షణం,మనం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.

ప్రస్తుతం బిగ్ బాస్ 2 కి ఎంపిక అవ్వటంతో తనలోని అన్ని కోణాలను అభిమానులకు చూపించే అవకాశం వచ్చిందని చాలా సంబరపడిపోతుంది. ఈమెకు టాలీవుడ్ లో నవదీప్ చాలా క్లోజ్ అట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."