Movies

బిగ్ బాస్ కి బాహుబలికి లింక్ ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది. బుల్లితెరపై సినిమా స్టార్స్ దృష్టి పెట్టేలా భారీ ప్రేక్షక ఆదరణ పొందిన భారీ రియాల్టీ షో. బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న టీవీ ఛానల్ వద్దే బాహుబలి రెండు పార్ట్ ల శాటిలైట్ హక్కులు ఉన్నాయి. తాజాగా వీటికి సంబందించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం నుండి ప్రారంభం అయినా సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రారంభం అవ్వటానికి ముందు బహుబలి 1 ,బాహుబలి 2 సినిమాలను వరుసగా ప్రసారం చేసారు.

దీని వెనక ఒక సేంట్ మెంట్ ఉందట. బిగ్ బాస్ సీజన్ 1 ప్రారంభం అయ్యినప్పుడు కూడా ఈ రెండు సినిమాలను వరుసగా ప్రసారం చేసారు. బిగ్ బాస్ సీజన్ 1 తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక TRP ని సాధించిన కార్యక్రమంగా రికార్డ్ సృష్టించింది.

అదే సేంట్ మెంట్ తో బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభం అయినప్పుడు కూడా ఫాలో అయ్యి బాహుబలి రెండు సినిమాలను వరుసగా ప్రసారం చేసారు. ఈ సేంట్ మెంట్ వర్క్ అవుట్ కావాలని కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."