Movies

రేణు దేశాయ్ ఎవరి కూతురో తెలుసా? బయట పడ్డ నమ్మలేని నిజాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రేమకావ్యం నడిపిన రేణుదేశాయ్ అంటే పవన్ అభిమానులకు ఎంతో ఇంట్రెస్ట్. అయితే పరిస్థితుల కారణంగా పవన్ నుంచి వేరుపడిన రేణు పుట్టింటికి చేరి తనకంటూ ఓ గుర్తింపు కోసం కృషిచేస్తోంది. ఎందుకంటే పవన్ తో గడిపినపుడు పుట్టిన పిల్లలిద్దరూ ఇప్పుడు రేణు వద్దే పెరుగుతున్నారు కదా. ఓ వైపు పవన్ మరోపెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నా,రేణు మాత్రం ఎంతోసంయమనంతో పిల్లలకోసం తనవిలువైన కాలాన్ని త్యాగం చేస్తోందని చెప్పక తప్పదు. ఈనేపథ్యంలోనే తనకు తగిన భాగస్వామి దొరికాడంటూ రేణు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చాలామందికి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఎవరతను అంటూ అభిమానుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది.

గుజరాత్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రేణు ప్రస్థానం నిజంగా ఆసక్తికర అంశం. ఈమె పేరెంట్స్ చాలాక్రితం మహారాష్ట్రలోని పూణేలో సెటిల్ అయ్యారు. 1975లో వాళ్లకు ఓ అమ్మాయి పుట్టింది. రెండోసారి అయినా అబ్బాయి పుడతాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు రేణు పుట్టింది. 1981డిసెంబర్ 4న రేణు జన్మించింది.

మూడోసారి అబ్బాయి పుడతాడని గంపెడాశతో ఉన్న ఆమె తండ్రి మళ్ళీ అమ్మాయి పుట్టేస్తుందేమో ననే కోపంతో మూడు రోజులపాటు ఆసుపత్రి ఛాయలకు కూడా అతను వెళ్లలేదట. మొత్తానికి మూడవ సంతానంగా కొడుకు పుట్టాడు. ఇక ఇంట్లో పరిణామాలు రేణుని బాల్యంలో వివక్ష ఎదుర్కొనేలా చేశాయి. ఇంట్లో ఆమె అక్క కన్నా,తనకన్నా తన తమ్ముణ్ణె బాగా చూసేవారట తమ్ముడు ఏంచేసినా ఒక్కమాట కూడా తల్లిదండ్రులు అనేవారు కాదట. పైగా అతడిని ఎంతో గారాబంగా చూసేవారట.

రేణు గానీ, ఆమె అక్కగానీ చిన్న తప్పుచేస్తే చాలు చితకబాదేవారట. పుణేలో చదువు పూర్తిచేసుకున్న రేణు మొదట్లో మోడలింగ్ చేసిందట. ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహదేవన్ సెన్సేషన్ సాంగ్ లో కనిపించిన రేణు, ఆపాటతో దర్శకుడు పూరి జగన్నాధ్ దృష్టిలో పడింది. ఆవిధంగా బద్రి సినిమాలో రేణు ఛాన్స్ దక్కించుకుంది.
Renu Desai
ఇక్కడ విషయం ఏమిటంటే ఈసినిమా షూటింగ్ సగం పూర్తయ్యేవరకూ అసలు పవన్ ,రేణుల మధ్య మాటలే లేవట. దీంతో ఓ రోజు పూరీ చొరవ తీసుకుని ఒకరినొకర్ని పరిచయం చేసాడు. ఇక అక్కడి నుంచి పవన్,రేణులు ప్రయివేట్ గా హోటల్స్ లో కలుసుకుని,డిన్నర్ లు, షికార్ల వరకూ పాకింది. ఆతర్వాత జానీ చిత్రం నాటికి లివింగ్ రిలేషన్ షిప్స్ మొదలయ్యాయి.

అకిరా పుట్టేనాటికి పెళ్లి కూడా చేసుకోలేదు. చివరికి కుటుంబ సభ్యుల వత్తిడితో 2009లో పవన్ తో రేణుకి పెళ్లయింది. ఆతర్వాత ఏడాది ఆద్య పుట్టింది. ఇక కొన్నాళ్లకే పవన్ తో ఆమెకు విబేధాలు స్టార్ట్ అయ్యాయి.ఇక అదే సమయంలో ఆరెంజ్ చిత్రం తీసి నాగబాబు తీవ్రంగా దెబ్బతిన్నాడు. దాంతో పవన్ పెద్దఎత్తున పవన్ డబ్బు సాయం అందించి అన్న నాగబాబుని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేసాడు. అదేరీతిలో కుటుంబ సభ్యులు ఎవరు కష్టాల్లో ఉన్నామని వచ్చినా పెద్దమొత్తంలో చెక్కులు ఇవ్వడంతో రేణు తీవ్రంగా వ్యతిరేకించింది.

ఇలా ఎవరికీ పడితే వాళ్లకు ఇస్తూ పొతే రేపొద్దున పిల్లల సంగతేంటని ఓ సాధారణ మహిళగా తన ఆవేదన బయట పెట్టిందట. అయితే పవన్ ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉండేవి. తన కుటుంబ సభ్యులకు సాయం చేస్తే రేణు అభ్యంతరం చెప్పడాన్ని తట్టుకోలేక పోయిన పవన్, అదే కారణంతో రేణుని దూరం పెట్టాడని ప్రచారం సాగింది.

ఇక పవన్ తో విభేదించి పిల్లలను తీసుకుని పూణే వెళ్ళిపోయింది. మరాఠీ చిత్రాలకు డైరెక్షన్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ‘మంగళాష్టక వన్స్ పూర్ , ఇష్క్ వాలా వంటి చిత్రాలను తెరకెక్కించిన రేణు. కొన్ని టివి షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ , మళ్ళీ తెలుగు నేలపై అడుగుపెట్టింది. ఇక పవన్ నుంచి డైవర్స్ తీసుకున్న కొత్తలో తాను లైఫ్ లో మరొకర్ని ప్రేమించలేనని చెప్పిన రేణు,తాజాగా ఓ వ్యక్తితో సన్నిహతంగా ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పెట్టడం నిజంగా సంచలనం సృష్టించింది. తనను అర్ధం చేసుకునే వాడు దొరికాడని, తన జీవితానికి ఓ అర్ధం ఏర్పడిందని రేణు చెబుతోంది. ఇప్పుడు ఎంగేజ్ మెంట్ రింగ్స్ ఉన్న ఫోటోలను పెట్టి అందరికి షాక్ ఇచ్చింది రేణు.