Movies

‘అరవింద సమేత’ లో త్రివిక్రమ్ సత్తా చాటే టాప్ 10 డైలాగ్స్ ఇవే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇది. సినిమాలో ఎన్టీఆర్ నటన ఒక ఎత్తైతే త్రివిక్రమ్ డైలాగ్స్ మరో ఎత్తు. సినిమాలో టాప్ డైలాగ్స్ ఏమిటో ఒకసారి చూద్దాం.

1. జీవితంలో ఎప్పుడైనా సాగిపోవాలి.. ఎక్కడా ఆగిపోకూడదు

2. వినే టైము.. చెప్పే మనిషి వల్ల.. విషయం విలువే మారిపోతుంది.

3. ఆన్సర్ లేని క్వశ్చన్ ఉండొచ్చేమో కాని నీ మీద ప్రేమ లేకుండా ఉండలేను.

4. నన్ను నమ్మిన వాళ్లకి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తోడు ఉంటూనే ఉంటాను.

5. విలన్ తో ఎన్.టి.ఆర్ చెప్పే డైలాగ్.. నీ పేరు విలువ నీకేం తెలుసురా.. మీ అమ్మానాన్న గుర్తుంటే తెలుస్తుంది.

6. మీరు ఏం చేస్తుంటారు.. మొన్నటిదాకా మొక్కలను కాపాడాను.. ఇప్పుడు ఇంకోటేదైనా ప్లాన్ చేయాలి.

7. ఆనందం ఎప్పుడైనా అరుదుగానే దొరుకుతుందండి.. అందుకే మనం ఎప్పుడూ దుఖిస్తూ సుఖిస్తూ జీవిస్తూ ఉండాలి..

8. గంటల్లో సంపాదించే వాడికి ఎప్పుడూ నెల జీతం తీసుకునేవాడు తోడుగా ఉన్నప్పుడే ఆ సంస్థ బలంగా ఉంటుంది.

9. సుఖం అన్నం రూపంలో వస్తే ఎవడూ తీసుకోడు, కాని అదే అన్నం బిర్యాని రూపంలో వస్తే ఎవడైనా తీసుకుంటాడు.

10. ఆలోచించే వాడికంటే ఆలోచింపచేసే వాడే గొప్పోడు

11. మీ తాత కత్తి పట్టినాడు అంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడు అంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం.. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమవుతుందా..