Movies

టాలీవుడ్ లో ఏ మాత్రం ఇగో లేని టాప్ స్టార్స్ ఎవరో తెలుసా?

ఎవరైనా ఏదైనా రంగంలో రాణిస్తుంటే ఒకింత గర్వం,పొగరు,అహం ఏర్పడిపోతాయి. చుట్టూ ఉన్న వాతావరణం,కొంతమంది చేసే హంగామా వలన సహజంగానే అహం పెరిగిపోతుంది. ఇక సినిమా రంగంలో వెలిగిపోయే టాప్ స్టార్స్ కి ఎంత పొగరు,గర్వం,అహం వచ్చేస్తాయో చెప్పలేం. పరిస్థితుల ప్రభావం అలాంటిదని చెప్పక తప్పదు. అయితే కొంతమంది అందరితో కలసిపోయి సాదాసీదాగా ఉంటారు.

అలాంటి వాళ్ళను పరిశీలిస్తే,అల్లు అర్జున్ బయటకు వస్తే కాస్త సీరియస్ గానే ఉంటాడు. అయితే ఇగో అసలు లేదు. చాలా సింపుల్ గా ఉంటాడు. షూటింగ్ లో కూడా అందరితో ఫ్రెండ్లి నేచర్ తో ఉంటాడని ఎవరిని అడిగినా చెబుతారు.

ఇక జగపతి బాబు చాలా కాలం నుంచి సినిమాల్లో ఉంటున్నా స్టార్ డమ్ అనే విషయాన్ని అసలు పట్టించుకోరు. షూటింగ్ సమయంలో అందరితో సరదాగా ఉంటూ,నవ్వుతూ,నవ్విస్తారు. ఈయన మెడికల్ షాపు కి కారు దిగి స్వయంగా వెళ్లిన సందర్భాలు చాలానే వున్నాయి. ఎక్జిబిషన్ గ్రౌండ్ కి ఒక్కరే వెళ్లి షాపింగ్ చేస్తారు.

ముఖ్యంగా రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తే,మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఉంటాడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్న విషయాన్ని రామ్ చరణ్ నమ్ముతాడని డైరెక్టర్ సుకుమార్ ఓ సందర్భంలో చెప్పాడు.

సునీల్ గురించి చెబితే, కమెడియన్ నుంచి హీరోస్థాయికి చేరిన నటుడు. కమెడియన్ గా ఉన్నప్పుడు,స్టార్ హీరోగా ఎదిగినప్పుడు కూడా ఒకేలా ఉంటూ ఏమాత్రం గర్వం లేకుండా ఉండడం ఇతని గొప్పతనం.

ఇక సాయి ధర్మ తేజ్ తాను హీరో ననే విధంగా ప్రవర్తించకుండా అందరితో సరదాగా ఉంటాడు. రాశీఖన్నా కూడా సాయి ధర్మ తేజ్ గురించి ఇలానే చెప్పింది. నటుడు నాజర్ సింప్లిసిటీ గా వుంటారు. ఎక్కడ షూటింగ్ జరిగినా నాకిది కావాలని ఎప్పుడూ డిమాండ్ చేసిన సందర్భాలు లేవట. అందరితో కలివిడిగా ఉంటారు.

హీరో రాజా షూటింగ్ లో కనిపించే ప్రతిఒక్కరినీ పలకరిస్తారు. పెద్ద హీరోల నుంచి లైట్ బాయ్ వరకూ అందరినీ తన పెళ్ళికి ఆహ్వానించడమే ఇతనికి గర్వం లేదనడానికి నిదర్శనం.

ఇక హీరో శ్రీకాంత్ గురించి పరిశ్రమలో ఎవరిని అడిగినా మంచిగానే చెబుతారు తప్ప ఎవరూ చెడుగా మాట్లాడరు. అందరినీ ఒకేలా చూస్తారు.

కమెడియన్ ఆలీ విషయానికొస్తే,ఎవరితోనైనా సరదాగా మూవీ అయిపోతాడు. ఆలీకి గల ఓపిక పరిశ్రమలో మరెవ్వరికి పరిశ్రమలో ఉండదు.

హీరో నాని చాలా సింపుల్ గా, కంఫర్ట్ గా ఉంటాడు. పరిశ్రమలో చిన్న నటుడి స్థాయినుంచి పెద్దవాళ్ళ వరకూ అందరు ఇష్టపడే నటుడు నాని. తాజాగా అతని ఫ్రెండ్ మెకానిక్ షెడ్డు ఓపెనింగ్ చేసి తన సింపుల్ సిటీని చాటుకున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."