Movies

సినీ తారల మరణం వెనక ఎన్ని కన్నీటి గాధలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సినిమాల్లో హీరోయిజం చూపించే వాళ్ళు నిజజీవితంలో సమస్యలను తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. సినిమా వేరు,జీవితం వేరు అని అందుకే చాలామంది అనే మాట. సినిమాలో హీరోకి ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కొన్నట్లు చూపించేస్తారు. అది హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు. కానీ వాస్తవంలో సమస్యలు ఎదురైతే తట్టుకోలేరు. అలాంటి కొన్ని జీవితాలను మనం పరిశీలిద్దాం.

దివ్యభారతి విషయం తీసుకుంటే, బొబ్బిలి రాజా మూవీతో తెలుగులో పరిచయం అయిన ఈ భామ ఎన్నో హిట్ మూవీస్ లో నటించింది. అయితే 1993ఏప్రియల్ లో కేవలం 19ఏళ్ళ వయస్సులోనే ముంగురు లోని 5అంతస్తుల అపార్ట్ మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మరణం ఓ మిస్టరీగా మిగిలిపోయింది.

ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి ఇన్నో హిట్స్ అందుకున్న ఉదయకిరణ్ ఆత్మహత్య కూడా అనుమానాస్పదం అయింది. అతడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని సన్నిహితులు వాదిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు లేవని, ఇక పెళ్లయి పట్టుమని 14నెలలే అయిందని, ఎలా చూసినా ఇతని మరణం అనుమానాస్పదమేనని అంటున్నారు. సినీ కెరీర్ బాగుంటే,గౌరవం , రెమ్యునరేషన్ అన్నీ బాగుంటాయి. అదే కెరీర్ సరిగ్గా లేకపోతె అన్నింటా తక్కువే అన్నట్టు ఉంటుంది. ఎవరూ పట్టించుకోరు. పైగా ఇన్నాళ్లూ తమతో ఉన్నవాళ్లు, ఎదురుపడినా పలకరించరు.

ఇక ఉదయకిరణ్ మాదిరిగానే బాలీవుడ్ యువ నటి నఫీసా జియా ఖాన్ గత ఏడాది ఉరిపోసుకుని మరణించింది. 25ఏళ్ళ ఈ అమ్మాయికి సినీ కుటుంబానికి చెందిన సూరజ్ పంచోలి తో ప్రేమ బంధం తెగిపోయింది. 1990దశకంలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె సినీ కెరీర్ కన్నా ఇంటీరియర్ డెకరేటర్ గా స్థిరపడాలని ఆమె భావించి,ఇదే విషయాన్నీ తల్లికి కూడా చెప్పింది. ఇక తెలుగు సినిమాల్లో ఛాన్స్ కోసం ఆడిషన్స్ కి వచ్చినా, ఛాన్స్ రాలేదు. ఇక నిరాశ నిస్పృహలతో చివరకు ప్రాణం తీసుకుంది. కేవలం మూడు సినిమాలతోనే ఈమె తనువు చాలించింది.

ఇక దక్షిణాదిన తన నటనతో ఓ ఊపేసిన సిల్క్ స్మిత దాదాపు 400మూవీస్ లో నటించి ఎంతోమందిని ఆకట్టుకుంది. అయితే 18ఏళ్ళక్రితం వ్యక్తిగత వైఫల్యాలు,ఆర్ధిక ఇబ్బందులతో తాగుడికి బానిసై ఆత్మహత్య చేసుకుని,ఈలోకం వీడింది.

ఇక కె బాలచందర్ సినిమాల్లో నటించి, ఫటాఫట్ జయలక్ష్మిగా తన మేనరిజంతో పేరుతెచ్చుకున్న ఓ నటి ఓ ప్రేమ వ్యవహారంలో విఫలమై ప్రాణాలు తీసుకుంది. తమిళ నాడు సీఎం గా చేసిన ఎంజీఆర్ సోదరుడు చక్రపాణి కుమారుణ్ణి ఆమె ప్రేమించింది. పెళ్ళికి తాత్సారం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ఇక కన్నడ నటి కల్పన కూడా నటిగా పేరు, డబ్బు దండిగానే సంపాదించి, అవార్డులు కూడా సొంతం చేసుకున్న కల్పన ఆ వైభవం తగ్గాక నిరాశతో కొట్టుమిట్టాడి చివరకు రంగస్థలం మీద కూడా నటించినప్పటికీ పూర్వ వైభవం రాకపోవడం ఆమెను ఆత్మహత్య కు ప్రేరేపించాయి. అలాగే మలయాళ నటి శోభా కూడా బలవన్మరణం చేసుకుంది. బాలనటిగా మొదలుపెట్టి,దక్షిణాది భాషల్లో రాణించిన ఈమె ఉరిపోసుకుంది. అయితే ఆత్మహత్యా, హత్యా అనే అనుమానాలు రేకెత్తాయి.

ఇక ఓ సామాన్య టీచర్ కూతురు అయిన నటి ప్రత్యుష మరణం కూడా అనుమానాలు రేపింది. సిద్దార్ధ రెడ్డి అనే అబ్బాయిని ప్రేమించడం, తదనంతర పరిణామాల్లో ఈమె మరణం సంభవించింది.