Movies

‘అరవింద సమేత’ సినిమాలో పూజకి డబ్బింగ్ ఎవరు చెప్పారో తెలుసా? నమ్మలేని నిజం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం మూవీలో జిగేల్ రాణి పాటతో హిట్ కొట్టి, స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ ని టాప్ రేంజ్ లో నిలబెట్టుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఓ పక్క హీరోయిన్ గా వేస్తో మరోపక్క ఐటెం సాంగ్ తో అదరగొట్టేసిన ఈ స్లిమ్ బ్యూటీ నిజానికి రంగస్థలం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో జిగేల్ రాణి పాటతో అంతకంటే ఎక్కువగా బ్లాక్ బస్టర్ అయింది పూజ. ఈసినిమాకు ముందు డిజెలో తన అందాలు ఆరోబోసి ఆకట్టుకున్న ఈమె తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద్ సమేత లో సినిమాలో తన నటనతో పూజా ఆకట్టుకుంది. మొదట్లో సినిమా ఛాన్స్ లు వెతుక్కుంటూ వస్తే, ఆతర్వాత అవకాశాల కోసం ఆమె ఎదురుచూడాల్సి వచ్చింది. అలా చాలా కష్టాలే చూసింది.

నిజానికి పూజ హీరోయిన్ గా రాణించడానికి చాలా కష్టపడింది. ముంబయికి చెందిన పూజా తండ్రి మంజునాధ్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తల్లి లత ఓ సైన్టిస్ట్. పూజ అన్నయ్య ఋషభ్ ఓ డాక్టర్. కాలేజీ డేస్ లో కాలేజీలో జరిగిన ఓ యూత్ ఫెస్టివల్ పోటీల్లో మిస్ ఇండియా నిర్వాహకుల ప్రతినిధి వచ్చారు. పూజను చూసి అందాల పోటీకి వెళ్ళొచ్చుగా అని అయన అనడంతో ఆమె సీరియస్ గానే తీసుకుంది. ఆదిశగా అడుగులు వేసింది. బెంగుళూరులో అందాల పోటీల్లో పాల్గొనడానికి ట్రైనింగ్ అయింది.

2010లో మిస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెల్చుకుంది. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అయ్యారంటే వాళ్ళ స్టేటస్ ఎలా ఉంటుందో ,వాళ్లపై సినిమా వాళ్ళ కళ్ళు ఎలా పడతాయో చెప్పక్కర్లేదు. ఎన్నో సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా, మరెన్నో యాడ్స్ కి పనిచేసిన పూజకు సినిమా ఛాన్స్ లు కూడా తలుపు తట్టాయి. అలా 2012లో తమిళంలో జీవాతో కల్సి పూజా చేసిన మూగముడి మూవీ తెలుగులో మాస్క్ గా వచ్చింది.

దాంతో పేరు తెచ్చుకున్న ఈమె నాగచైతన్యతో కల్సి ఒకలైలా కోసం మూవీ చేసి, తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత ముకుంద మూవీతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. బాలీవుడ్ లో మోహింజుదారో తో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ ప్లాప్ కారణంగా ఎన్నో ఛాన్స్ లు పూజకు మిస్సయ్యాయి.

ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబుతో మహర్షి సినిమాలోనూ,ప్రభాస్ సినిమాలోనూ నటిస్తున్న పూజా ఇటీవల విడుదలైన అరవింద సమేతలో నటించి, మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు పూజకు మంచి పేరువచ్చింది. అయితే ఈ సినిమాలో తన పాత్రకు తానె డబ్బింగ్ చెప్పుకుని మరో సంచలనం సృష్టించింది.