Movies

రజనీకాంత్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా? వీరి పెళ్లి ఎంత విచిత్రంగా జరిగిందో తెలుసా?

అటు తమిళంలో గానీ, ఇటు తెలుగులో గానీ హీరోలది ఒక్కొక్క బాణీ. నటన మీద దృష్టి పెట్టేది కొందరైతే,స్టైల్ మీద దృష్టి సారించేది కొందరు అని చెప్పాలి. ఇక రెండవకోవలోకి సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తారు. రజనీకాంత్ అనగానే ఆయన స్టైల్ గుర్తొస్తుంది. ఒకప్పుడు విలన్ గా వేసినా, ఆతర్వాత హీరోగా వేస్తున్నా సరే, రజనీ స్టైల్ గురించే ప్రస్తావించాలి. ఇక అలాంటి స్టైల్ ఎవరికీ రాదు. అందుకే ఫారిన్ లో కూడా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా విదేశాల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్న తొలిహీరో కూడా రజనీకాంత్ అని చెప్పాలి.

రజనీకాంత్,లత ల వివాహం జరిగిన రోజు ఫిబ్రవరి 26. వీరికి ఐశ్వర్య ,సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలతో జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇక కూతుళ్లిద్దరూ దగ్గరుండి మరీ రజనీకాంత్ పెళ్లి వేడుకలను ప్రతియేటా ఘనంగా జరిపిస్తుంటారు. నిజానికి లత ఓ కాలేజీలో చదువుతుండగా, రజనీకాంత్ తో పెళ్లయింది. మద్రాస్ యతిరాజ్ కాలేజీలో ఆమె ఇంగ్లీషు లిటరేచర్ లో ఎం ఏ చేసింది. కాలేజీలో చదివేరోజుల్లో నిర్వహించే, ఓ మ్యాగజైన్ నిర్వహణ లత చూసేవారు. ఆమె బంధు వర్గంలో వైజి మహేంద్రన్,వైజయంతిమాల వంటి స్టార్స్ ఉండడంతో సినిమా వాళ్ళ ఇంటర్యూలకు లతను పంపించేవాళ్ళు.

ఆవిధంగా ఓసారి రజనీకాంత్ ని ఇంటర్యూ చేయడానికి వెళ్లిన లతను రివర్స్ లో రజనీ ఇంటర్యూ చేసాడట. నిజానికి ఎవరో వచ్చారని అసిస్టెంట్ చెబితే,అభిమాని అనుకున్నారట రజనీ. లోపలకు వచ్చిన లతను చూడగానే రజనీ ముఖం వెలిగిపోయిందట. దీంతో మీ పేరు , మీ పేరెంట్స్ ఎవరు ఇలా అన్నీ అడిగేస్తూ, ఆమెను రజనీ ఇంటర్యూ చేసాడట.

అసలే ఈ షాక్ నుంచి ఆమె కోలుకోకముందే,ప్రపోజ్ చేసి మరింత షాక్ ఇచ్చాడట. అయితే నాకు ఇంగ్లీషు రాదనీ, తమిళంలోనే అడగమని రజనీ నిజాయితీగా చెప్పడం లతకు బాగా నచ్చిందట. ఇక రజనీ గురించి అందరూ మంచిగా చెప్పుకోవడంతో కొన్నాళ్ళకు ఆమె లవ్ లో పడింది. చివరకు ఇంట్లో వాళ్ళని సైతం ఒప్పించి రజనీని ఆమె పెళ్లాడారు.

ఇక పెళ్లయ్యాక కొన్ని సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినా చేయలేదు. అయితే కొన్ని సినిమాల్లో పాటలు మాత్రం పాడారు. చెన్నైలో ఇంటర్ నేషనల్ స్కూల్ కి హెడ్ గా ఉంటున్న లత, తమ కుమార్తెలు నిర్మించే సినిమాలకు ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. కాగా వాస్తవానికి మరాఠీ వ్యక్తి అయిన రజనీకాంత్ కర్ణాటకలో పుట్టి,తమిళనాట హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

తమిళనాట రజనీ పేరు చెబితే చాలు అభిమానులు తరంగమై వస్తారు. ఇక ఆలిండియా లెవెల్లో ఈయనకున్న మార్కెట్ దృష్ట్యా వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీయడానికి ఎందరో ముందుకొస్తున్నారు. ఇక పార్టీ పెట్టి, రాజకీయ రంగంలో కూడా కాలుమోపారు.