Movies

విజయశాంతి భర్త ప్రసాద్ గురించి షాకింగ్ న్యూస్… బాలకృష్ణకి విజయశాంతి భర్తకు రిలేషన్ ఏమిటో తెలుసా?

హీరోయిన్స్ చాలామంది ఉండవచ్చు కానీ,హీరో ఇమేజ్ తెచ్చుకునేవాళ్ళు మాత్రం అరుదుగా వుంటారు. అందులో విజయశాంతిని ముందువరసలో చెప్పుకోవాలి. లేడీ ఓరియెంటెండ్ పాత్రలతో మెప్పించిన ఈమె హోరోలే కాదు హీరోయిన్స్ కూడా బాక్సాఫీస్ దగ్గర షేక్ చేస్తారని నిరూపించిన చరిత్ర క్రియేట్ చేసింది. ఆమె కోసం ప్రత్యేక కథలు రాసి, డైనమిక్ పాత్రలు సృష్టించేవారంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్కసారి హీరోలు సైతం ఆమెతో పోటీ పడి నటించడానికి వెనుకాడేవారు. ఎందుకంటే ఆమె డామినేట్ చేసేస్తే, తమ కెరీర్ దెబ్బతింటుందని అగ్ర హీరోలు భయపడేవారట.

కెరీర్ చివరిలో అన్నీ హీరోయిన్ ఇమేజ్ గల పాత్రలే చేసిన విజయశాంతి పెళ్లి విషయం ఎవరికీ తెలీకుండా గోప్యంగా జరిగిపోయింది. ఆమె భర్త ఎంవి శ్రీనివాస ప్రసాద్ ఎవరంటే నందమూరి తారకరామారావు పెద్దల్లుడుకి స్వయానా మేనల్లుడు. దీంతో శ్రీనివాస ప్రసాద్ కి నందమూరి బాలకృష్ణతో మంచి సంబంధం ఉండడమే కాదు. మంచి ఫ్రెండ్స్ కూడా.

నిజానికి నిప్పురవ్వ సినిమా కోసం విజయశాంతిని హీరోయిన్ గా పెట్టుకోవాలని ప్రసాద్ భావించాడు. బాలయ్య హీరో గా ఎంపిక పూర్తయింది. విజయశాంతి అనుమతి కోసం వెళ్లడం జరిగేది. అయితే పేరెంట్స్ ని కోల్పోయిన విజయశాంతి బాధల్లో ఉండేది. దీంతో శ్రీనివాస్ ప్రసాద్ తో సాన్నిహిత్యం ఏర్పడింది.

నిప్పురవ్వ సినిమాయే కాదు, మిగిలిన సినిమాల కాల్ షీట్స్ కూడా చూసుకోవాలని కోరింది. దీంతో అప్పటినుంచి ఆమె వ్యవహారాలన్నీ ప్రసాద్ చూసేవాడు. అలా ఇద్దరి మధ్యా పెరిగిన అనుబంధం పెళ్ళికి దారితీసింది. అయితే నిప్పురవ్వ కాస్తా దెబ్బతినడంతో ఇక సినిమాల జోలికి వెళ్ళలేదు. డబ్బింగ్ సినిమాలు చేస్తూ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. హైదరాబాద్, చెన్నైలలో అనేక వ్యాపారాల్లో బిజీగా ఉన్నాడు.