Movies

అల్లు రామలింగయ్య జీవితంలో ఎన్నిబాధలను, కష్టాలను అనుభవించారో తెలిస్తే అయ్యో అంటారు

తెలుగు చిత్రసీమలో రేలంగి తర్వాత అంతటి హాస్యాన్ని పండించి,జనాన్ని మెప్పించిన కమెడియన్ అల్లు రామలింగయ్య. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకడైన తెనాలి రామలింగడు ఎలా చరితార్థుడు అయ్యాడో అల్లు రామలింగయ్య కూడా అంతటి స్థానాన్ని అందుకున్నారని చెప్పాలి. హోమియో వైద్యునిగా,స్వాతంత్ర్య సమరయోధునిగా,హాస్య నటుడిగా అల్లు పోషించిన పాత్ర అద్వితీయం. భారత ప్రభుత్వం నుంచి రేలంగి తర్వాత పద్మశ్రీ పురస్కారం అందుకున్న హాస్యనటుడిగా నిలిచారు. ఇక కొడుకు అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్ గా, అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా, మనవడు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా ఎదిగిన క్రమాన్ని కళ్లారా చూసి మరీ తృప్తిగా ఈ లోకం నుంచి నిష్క్రమించిన అల్ల్లు రామలింగయ్య భౌతికంగా లేకున్నా, కళాకారునిగా అందరి గుండెల్లో పదిలంగానే ఉంటారు. అయితే ఆయన పడ్డ కష్టాలను , ఇబ్బందులను ఒకసారి పరిశీలిస్తే, నటుడు అవ్వడానికి చాలా శ్రమించారు.

పెద్దగా చదువు అబ్బని,అల్లు రామలింగయ్య సహచరులతో కల్సి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే సమయంలో నాటకాల్లో నటించాలన్న కోరిక పుట్టింది. ఊళ్లోకి ఎవరైనా నాటకాల వాళ్ళు వస్తే, వాళ్లతో మాటలు కలపడం, చిన్న వేషం ఉంటె ఇవ్వమని అడగడం చేసేవాడు. మొత్తానికి భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం దక్కింది. అదికూడా ఇంట్లో వాళ్లకు తెలీకుండా అప్పట్లో మూడు రూపాయలు ఎదురు ఇచ్చాడట. ఇక ఓసారి ఇంట్లో బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మేసి, నాటక కాంట్రాక్టర్ కి ఇచ్చాడు. అలా నాటకాల్లో నటిస్తూనే, సామజిక బాధ్యతను కూడా గుర్తించాడు.

గాంధీజీ పిలుపు అందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. అంటరానితనం మీద పోరాటం చేసాడు.ఇక సినీ రంగంలో చేరి ఎన్నో హాస్య పాత్రలతో అల్లు అలరించాడు. కాగా ముత్యాల ముగ్గు సినిమా సమయంలో కుమారుడు హఠాత్తుగా చనిపోతే, ఆ దుఃఖాన్ని దిగమింగుకుని యధావిధిగా షూటింగ్ కి హాజరయిన గొప్ప నటుడు ఆయన. దాదాపు 1030 సినిమాల్లో నటించిన అల్లు రామలింగయ్య కామెడీతో కూడిన విలనిజంలో కొత్త ట్రెండ్ తెచ్చి, అందరి మన్ననలు పొందాడు.

రావుగోపాలరావు తో కల్సి,విలనిజంలో కూడిన హాస్యం చేస్తుంటే ఇక హాల్లో చప్పట్లే చప్పట్లు. ఏకంగా 50ఏళ్లపాటు సినీ రంగంలో నవ్వుతూ నవ్విస్తూ,ఎదిగిన అల్లు ని ఎన్నో సన్మానాలు గౌరవాలు వరించాయి. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ఇక ఎపి ప్రభుత్వం 2001సంవత్సరానికి రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. పాలకొల్లులో విగ్రహం కూడా పెట్టారు. ఇక భారత చలన చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా 50తపాలా బిళ్ళలు విడుదల చేస్తే, అందులో అల్లు పేరిట ఓ తపాలా బిళ్ళ ఉండడం గ్రేట్.